David Warner Retirement : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోనున్నట్లు ఇటీవలే తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున మరోసారి ఆడాలని ఉందంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అధ్యాయం ముగిసింది అని అంటూనే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతానంటూ ఆ పోస్ట్ ద్వారా తెలిపాడు. సెలక్టర్లు ఎంపిక చేస్తే 2025లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా మళ్లీ బరిలోకి దిగుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
''అధ్యాయం ముగిసింది. సుదీర్ఘ కాలం అత్యున్నత క్రికెట్ ఆడటం నాకు ఓ గొప్ప అనుభూతి. ఆస్ట్రేలియా నా జట్టు. అంతర్జాతీయ స్థాయితోనే నా కెరీర్ చాలా వరకు గడిచిపోయింది. ఇలా ఆడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. అన్ని ఫార్మాట్లలో 100+ మ్యాచ్‌లు అనేది నా కెరీర్లో హైలైట్. ఈ జర్నీలో నాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు. మన అనుభూతి, అనుభవాలు ఇతరులకు తెలియదు. క్రికెట్ అభిమానులందరినీ ఎంటర్టైన్ చేశానని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా టెస్టుల్లో! ఇతరుల కంటే వేగంగా ఆడుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాను. ఇక కొన్నాళ్ల పాటు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతాను. అలాగే ఒకవేళ సెలక్టర్లు నన్ను ఎంపిక చేస్తే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాను'' అంటూ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు.
ఇక డేవిడ్ వార్నర్ కెరీర్ విషయానికి వస్తే, 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ స్టార్ క్రికెటర్, దాదాపు 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. 37 ఏళ్ల ఈ సీనియర్ ప్లేయర్ తన కెరీర్లో 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20ల్లో సత్తాచాటాడు. ఇదిలా ఉండగా, టెస్టుల్లో 8786 పరుగులు, వన్డేల్లో 6932 పరుగులు అలాగే పొట్టి ఫార్మాట్‌లో 3277 పరుగులతో అదరగొట్టాడు. జట్టు కష్టకాలంలోనూ పలు కీలక ఇన్నింగ్స్ ఆడి అభిమానులను అలరించాడు. ఐపీఎల్‌లోనూ యాక్టివ్ ప్లేయర్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు.
IPLలో ఫారిన్ ప్లేయర్ల హవా- వీళ్లు క్రీజులోకొస్తే పరుగుల వర్షమే - Overseas Player Most IPL Runs
అంతర్జాతీయ క్రికెట్‌కు వార్నర్ బైబై - ఎమోషనల్ అవుతున్న కో ప్లేయర్స్! - David Warner Retirement