CSK vs LSG IPL 2024: 2024 ఐపీఎల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నాలుగో విజయం నమోదు చేసింది. శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. సీఎస్కే నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (82 పరుగులు) భారీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా డికాక్ (54 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. చెన్నై బౌలర్లలో మతీషా పతిరణ, ముస్తాఫిజుర్ రహ్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన రాహుల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అయితే సీఎస్కేకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర గోల్డన్ డకౌటయ్యాడు. మోహ్సిన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (17) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో సీఎస్కే 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే నాలుగో స్థానంలో శివమ్ దూబె (3; 8 బంతుల్లో)కు బదులుగా రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు.
మరో ఓపెనర్ అజింక్య రహానె (36; 24 బంతుల్లో, 5x4, 1x6)తో కలిసి జడేజా కాస్త దూకుడగా ఆడటానికి ప్రయత్నించాడు. వీరిద్దరు బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో చెన్నై 51 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత రహానెను కృనాల్ పాండ్య క్లీన్‌బౌల్డ్ చేయడంతో సీఎస్కే కథ మారిపోయింది. దూబె, రహానె స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమీర్ రిజ్వీ ( 1) విఫలమయ్యారు. దీంతో 90 పరుగులకే చెన్నై అయిదు వికెట్లు కోల్పోయింది.
కానీ మరో ఎండ్‌లో ఉన్న జడేజా మొయిన్ అలీ (30) తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఓ దశలో జడ్డూ, అలీ నిలకడగా ఆడటంతో 15 ఓవర్లలో సీఎస్కే 105 పరుగులే చేసింది. ఆ తర్వాత వీరిద్దరు గేర్ మార్చారు. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్ సిక్సర్ బాది 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్‌లో మొయిన్ అలీ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. కానీ మరో భారీ షాట్‌కు యత్నించి అదే ఓవర్‌లో అలీ ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ బ్యాటు ఝుళిపించాడు. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్సర్ బాదాడు. యశ్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌లో కూడా ఓ సిక్సర్, రెండు బౌండరీలు సాధించాడు. దీంతో చెన్నై చివరి రెండు ఓవరల్లో 34 పరుగులు చేసింది. లఖ్‌నవూ బౌలర్లలో కృనాల్ 2 వికెట్లు పడగొట్టగా మోసిన్, యశ్ ఠాకూర్, బిష్ణోయ్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు.
6 బంతుల్లో 10 పరుగులు - చెన్నై కెప్టెన్‌కు వైఫ్ సూపర్ ఛాలెంజ్ - IPL 2024
భారత్ x పాక్ టెస్టు- చేతబడి వల్ల మ్యాచ్ నుంచి ప్లేయర్ ఔట్! - IND vs PAK Test