ETV Bharat / sports

గుజరాత్​ను చిత్తుగా ఓడించిన చెన్నై - వరుసగా రెండో విజయం - CSK vs GT 2024 IPL

CSK vs GT 2024 IPL: 2024 ఐపీఎల్​లో మంగళవారం చెన్నై- గుజరాత్ తలపడ్డాయి. ఈ మ్యాచ్​తో యువ కెప్టెన్లు తొలిసారి తలపడ్డారు. అయితే ఈ పోరులో శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ను రుతురాజ్ నాయకత్వంలోని సీఎస్కే ఓడించింది.

CSK vs GT 2024 IPL
CSK vs GT 2024 IPL
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 10:57 PM IST

Updated : Mar 27, 2024, 6:10 AM IST

CSK vs GT 2024 IPL : 2024 ఐపీఎల్​లో మంగళవారం (మార్చి 26) చెన్నై సూపర్‌ కింగ్స్‌ - గుజరాత్ టైటాన్స్‌ తలపడ్డాయి. ఈ పోరులో శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది సీఎస్కే. 63 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. యంగ్ బ్యాటర్ శివమ్ దూబే మెరుపు హాఫ్ సెంచరీ (51 పరుగులు, 23 బంతుల్లో: 2x4, 5x6)తో అదరగొట్టగా, రచిన్ రవీంద్ర (46 పరుగులు, 20 బంతుల్లో: 6x4, 3x6) దూకుడు ప్రదర్శించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (46 పరుగులు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.

రెచ్చిపోయిన రచిన్, దూబే: చెన్నై ఇన్నింగ్స్​లో రచిన్, దూబే మెరుపులతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ ఏకంగా 200+ స్ట్రైక్ రేట్​తో పరుగులు సాధించారు. తొలుత క్రీజులోకి వచ్చిన రచిన్‌ రవీంద్ర బౌండరీలతో విరుచుకు పడటంతో చెన్నై ఐదు ఓవర్లకే 58 పరుగులు చేసింది. ఓ ఎండ్‌లో రుతురాజ్‌ నిలకడగా ఆడుతుంటే, రచిన్‌ రవీంద్ర ఎదురు దాడికి దిగాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు.

అయితే పవర్‌ ప్లే లాస్ట్‌ ఓవర్‌లో గిల్, రషీద్‌ ఖాన్‌కి బాల్ ఇచ్చాడు. మొదటి బాల్‌నే బౌండరీకి తరలించిన రచిన్‌ రవీంద్ర, ఆ తర్వాత బాల్‌కే స్టంప్‌ అవుట్‌ అయ్యాడు. ఇక మిడిలార్డర్​లో వచ్చిన దూబే సైతం గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ తడబడింది. 8 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. ఇన్నింగ్స్​ మూడో ఓవర్లోనే కెప్టెన్ గిల్ (8 పరుగులు)ను కోల్పోయింది. వరుసగా వృద్ధిమాన్ సాహ (21 పరుగులు), విజయ్ శంకర్ (12 పరుగులు), డేవిడ్ మిల్లర్ (21 పరుగులు) విఫలమయ్యారు. సాయి సుదర్శన్‌ (37; 31 బంతుల్లో 3×4) టాప్‌ స్కోరర్‌. తుషార్‌ దేశ్‌పాండే (2/21), దీపక్‌ చాహర్‌ (2/28), ముస్తాఫిజుర్‌ (2/30) టైటాన్స్‌ను దెబ్బతీశారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన పతిరన (1/29) కూడా రాణించాడు.

యువ కెప్టెన్ల తొలిపోరు: ఈ మ్యాచ్​లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇరుజట్ల కెప్టెన్లు రుతురాజ్, గిల్​ ఈ ఐపీఎల్​తోనే సారథ్య బాధ్యతలు అందుకున్నారు. ఈ ఇద్దరూ టీమ్ఇండియాలో అరంగేట్రం కూడా చేశారు. ఇక తొలిసారి కెప్టెన్ హోదాలో పోటీపడటం మ్యాచ్​ కాస్త స్పెషల్​గా మారింది.

పంజాబ్​తో మ్యాచ్​ - అది నన్ను ఎంతో బాధించింది : కోహ్లీ - IPL 2024 PBKS VS RCB

ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఔట్ - ఫైనల్​ మ్యాచ్ చెన్నైలోనే - IPL 2024 Schedule

Last Updated : Mar 27, 2024, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.