ETV Bharat / sports

ఒకే ఒక్క IPL మ్యాచ్​తో ఆ ముగ్గురి కెరీర్ ​ఫినిష్ - ఎవరంటే? - Cricketers Who Played One IPL Match

author img

By ETV Bharat Sports Team

Published : Sep 1, 2024, 10:50 AM IST

Updated : Sep 1, 2024, 11:22 AM IST

Cricketers Who Played Only One IPL Match : అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించే ప్లేయర్లకు ఐపీఎల్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. చాలా కాలం ఐపీఎల్‌లో కొనసాగుతారు. అయితే ఓ ముగ్గురు స్టార్‌ ప్లేయర్లు మాత్రం ఈ ప్రీమియర్ లీగ్​లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడారు. ఇంతకీ వారెవరంటే?

IPL
IPL (Getty Images)

Cricketers Who Played Only One IPL Match : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చాలా మంది క్రికెటర్లకు గుర్తింపు తీసుకొచ్చింది. 2008లో ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది క్రికెటర్లు ఈ ప్రీమియర్ లీగ్ ద్వారా పరిచయమయ్యారు. వారిలో కొందరు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్‌ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. అయితే ఐపీఎల్‌లో చాలా అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయిన ఆటగాళ్లు కూడా ఉన్నారు.

అయితే ఈ రెండు కేటగిరీలు కాకుండా ఐపీఎల్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడిన క్రికెటర్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినప్పటికీ, ఐపీఎల్‌లో మళ్లీ కనిపించలేదు. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

షోయబ్ అక్తర్
క్రికెట్‌ ప్రపంచంలో షోయబ్ అక్తర్‌ని 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అని పిలుస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అక్తర్‌ ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫాస్ట్‌ బౌలర్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే గుర్తుండిపోయే ప్రదర్శన ఇచ్చాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 11 పరుగులు ఇచ్చి, 4 వికెట్లు పడగొట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ ఆటగాళ్లను పెవిలియన్‌ చేర్చాడు. దీని తర్వాత అక్తర్‌ మరో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడలేకపోయాడు. 2008 ముంబయి పేలుళ్ల తర్వాత పాకిస్థాన్‌ ప్లేయర్లు ఐపీఎల్‌లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేధించింది.

యూనిస్ ఖాన్
పాకిస్థాన్‌ సక్సెస్‌ఫుల్‌ టెస్ట్‌ కెప్టెన్‌గా యూనిస్ ఖాన్ గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌ 2008 సీజన్‌లో యూనిస్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు, అనుభవం ఉన్నప్పటికీ, యూనిస్ రాయల్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా కేవలం 3 పరుగులే చేశాడు.

ఆండ్రే నెల్
దూకుడైన బౌలింగ్, తీవ్రమైన స్లెడ్జింగ్‌కు దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ ఆండ్రే నెల్ ప్రసిద్ధి. ఈ స్టార్ ప్లేయర్​ను ఐపీఎల్‌ తొలి సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ఇక అభిమానులందరూ కూడా ముంబయి జట్టుకు నెల్ అదనపు బలం అవుతాడని భావించారు. అయితే యూనిస్ లాగే నెల్ కూడా ఒకే ఒక్క గేమ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో మూడు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి, కేవలం ఒక వికెట్‌ పడగొట్టాడు.

ముంబయి వీడనున్న సూర్యకుమార్? - ఈ స్టార్ క్రికెటర్ పైనే ఆ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్! - Suryakumar Yadav KKR

ఇంపాక్ట్ రూల్​పై BCCI రివ్యూ- ఆ టోర్నీలోపే క్లారిటీ! - BCCI Rules

Last Updated : Sep 1, 2024, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.