Cricketers From Wealthy Family : క్రికెట్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఓ అదృష్టం. దానికోసం ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. అయితే దేశంలోని చాలామంది సంపన్నులు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించి సత్తాచాటారు. పుట్టుకనుంచే గోల్డెన్ స్పూన్‌తో పెరిగి, భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించి తామేంటో నిరూపించుకున్నారు. ఇంతకీ వారెవరో ఈ స్టోరీలో చూసేద్దాం.
గౌతమ్ గంభీర్
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్ రిచెస్ట్ క్రికెటర్ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన గంభీర్, భారత జట్టులో విజయవంతమైన ఆటగాడిగానూ గుర్తింపు పొందాడు. గంభీర్ నికర ఆస్తి విలువ సుమారు రూ.205 కోట్లు అని ట్రేడ్ వర్గాల సమాచారం. గంభీర్ తండ్రి దీపక్ గంభీర్ ఓ విజయవంతమైన వ్యాపారవేత్త. వస్త్ర వ్యాపారంలో ఆయన మంచి లాభాలు గడించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, గౌతమ్ గంభీర్, అతని భార్య నటాషా జైన్ ఆస్తులు కోట్లలో ఉన్నాయని పేర్కొంది.
సౌరభ్ గంగూలీ
టీమ్ఇండియాతో పాటు క్రికెట్ లవర్స్ ముద్దుగా ఈయన్ను దాదా అని పిలుచుకుంటారు. గంగూలీ కూడా భారత శ్రీమంత క్రికెటర్లలో ఒకరు. గంగూలీ తండ్రి చండీదాస్ గంగూలీ ప్రింటింగ్ వ్యాపారంలో కోట్లు అర్జించారు. ప్రస్తుతం సౌరభ్ గంగూలీ నికర ఆస్తి విలువ రూ. 666 కోట్లు అని సమాచారం.
అజయ్ జడేజా
దిగ్గజ భారత క్రికెటర్ అజయ్ జడేజా రాజకుటుంబం నుంచి వచ్చారు. నవనగర్ రాజ కుటుంబంలో ఈయన జన్మించారు. జడేజా తండ్రి దౌలత్‌సిన్హ్ జీ జడేజా ప్రముఖ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం అజయ్ జడేజా నికర ఆస్తి విలువ దాదాపు రూ. 250 కోట్లు అని టాక్.
ఆర్యమాన్ బిర్లా
దేశవాళీలో తనదైనశైలిలో మెరుపులు మెరిపిస్తున్న ఆర్యమాన్ బిర్లా కూడా సంపన్న క్రికెటరే. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులో ఒకరైన పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్. కుమార్ మంగళం బిర్లా ఆస్తి సుమారు రూ.1.6 లక్షల కోట్లు. అయితే ఆర్యమాన్ నికర ఆస్తి విలువ రూ.70,000 కోట్లని సమాచారం.
రూ.70వేల కోట్ల నెట్‌వర్త్- ఈ క్రికెటర్ కుబేరుడు గురూ- రోహిత్, విరాట్ కాదు