MS DHONI IPL Retirement: 2024 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జర్నీ ముగిసింది. ఈ సీజన్లో చెన్నై ఇప్పటికే ఇంటిబాట పట్టింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఆ జట్టు స్టార్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీపై పడింది. రీసెంట్గా ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. కానీ, అలాంటిది ఏదీ జరగలేదు. ధోనీ తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఎక్కడావెల్లడించలేదు.
దీంతో ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతాడని ఫ్యాన్స్ అంటుంటే, ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై తాజాగా చెన్నై మేనేజ్మెంట్ స్పందించింది.'ధోనీ రిటైర్మెంట్ గురించి చెన్నై జట్టులో ఎవరికీ చెప్పలేదు. ఈ విషయంలో కాస్త సమయం తీసుకుంటాడు అనుకుంటున్నాం. అతడు ఓ నిర్ణయానికి వస్తే కచ్చితంగా మేనేజ్మెంట్తో చెప్తాడు' అని చెన్నై క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక ఆర్సీబీతో మ్యాచ్ గురించి కూడా సీఎస్కే మేనేజ్మెంట్ మెంబర్ ఒకరు స్పందించారు. '20వ ఓవర్లో ధోనీ భారీ సిక్స్ కొట్టాడు. ఆ బంతి స్టేడియం బయట పడింది. దీంతో బౌలర్‌కు కొత్త బంతి దొరికింది. కొత్త బంతిపే తేమ లేకపోవడం వల్ల బౌలర్‌కు గ్రిప్ దొరికింది. ఆ తర్వాత బంతికే ధోనీని ఔట్ చేయగలిగాడు' అని అన్నారు.
షేక్ హ్యాండ్ వివాదం: అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు చెన్నై ప్లేయర్లంతా ఫ్రెండ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు గ్రౌండ్లోకి వచ్చారు. ధోనీ సహా చెన్నై ఆటగాళ్లు అర్సీబీ ప్లేయర్లకు కరాచలనం ఇవ్వడం కోసం చాలాసేపు వెయిట్ చేశారు. ఎంతసేపటికీ వాళ్లు రాకుండా సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల ధోనీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. దీనిపై పలువురు మాజీలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ధోనీ పట్ల ఆర్సీబీ ప్లేయర్ల తీరను తప్పుబడుతున్నారు.
'నేను మ్యాచ్ అయిన తర్వాత కూడా అంతా చూశా. ఆర్సీబీ జట్టు చాలా ఎంజాయ్ చేసింది. విజయాన్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయం కూడా వారికి (ఆర్సీబీని ఉద్దేశించి) లేనట్లుంది. ఒకవేళ ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అయితే, దీనికి వారు పశ్చాత్తాప పడతారా? ధోనీ లాంటి సీనియర్ ప్లేయర్ మీ కోసం వెయిట్ చేసినప్పుడు, ఒక నిమిషం సెలబ్రేషన్ ఆపి వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సింది' అని మైకెల్ వాన్ అన్నాడు.
'ఆ మాట చాలా క్రేజీగా ఉంది - ధోనీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు' - IPL 2024
ఒంటిచేత్తో సిక్సర్స్ కొట్టిన స్టార్ క్రికెటర్ - వింటేజ్ ధోనీ ఈజ్ బ్యాక్ - IPL 2024