IND vs NZ Test Series 2024 : న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కోల్పోయింది. ఫలితంగా టీమ్ఇండియా స్వదేశంలో తొలిసారి టెస్టుల్లో వైట్‌వాష్ పరాభవాన్ని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా జరిగిన మూడో టెస్టులో 147 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 121 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (64 పరుగులు) తప్ప, మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. అయితే ఈ ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ స్పందించాడు. బ్యాటింగ్‌తోపాటు కెప్టెన్‌గానూ రాణించలేకపోయానని రోహిత్ అన్నాడు.
'ఈ ఓటమికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను. నేను నా స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోయా. కెప్టెన్‌గా జట్టును నడిపించిన తీరు కూడా సరిగ్గా లేదు. నా కెరీర్లోనే ఇది అత్యంత పేలవ ప్రదర్శన. ఇలాంటి పరిస్థితుల్లో మేం బాగా ఆడలేకపోయాం. మేం సమష్ఠిగా రాణించడంలో విఫలమయ్యాం' అని రోహిత్ శర్మ అన్నాడు. ఇక త్వరలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్‌పై దృష్టి పెట్టనున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. కాగా, ఈ సిరీస్‌లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. సిరీస్ మొత్తంలో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. అటు విరాట్‌ది కూడా ఇదే పరిస్థితి.
అది తప్పే కానీ ఫీల్ అవ్వను
ఛేజింగ్‌లో రెండు ఫోర్లు బాది టచ్‌లోకి వచ్చిన సమయంలో భారీ షాట్ ఆడి వికెట్ పారేసుకోవడంపై రోహిత్ స్పందించాడు. అది చెత్త షాట్ అని అంగీకరించిన రోహిత్ దానికి చింతించడం లేదని అన్నాడు. 'నేను చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నా. కానీ, దానికి చింతించడం లేదు. ఎందుకంటే గతంలో అలా ఆడి నేను సక్సెస్ అయ్యాను. కానీ మా ప్రదర్శన మాత్రం స్థాయికి తగ్గట్లుగా లేదు. న్యూజిలాండ్ మా కంటే మంచి క్రికెట్ ఆడింది.
ఇక రిషభ్ పంత్ ఎల్బీడబ్ల్యూ ఔట్ గురించి రోహిత్ మాట్లాడాడు. అయితే దానిపై క్లారిటీ లేదని చెప్పాడు. 'అక్కడ బంతి బ్యాట్‌ను తాకినట్లు కచ్చితమైన ఆధారం లేదు. అలాంటప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అంపైర్ నిర్ణయం సరైందా కాదా అనేది మాత్రం తెలియదు' అని అన్నాడు.
#TeamIndia came close to the target but it's New Zealand who win the Third Test by 25 runs.
— BCCI (@BCCI) November 3, 2024
Scorecard - https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/4BoVWm5HQP
సంక్షిప్త స్కోర్లు
- న్యూజిలాండ్ : 235 & 174
- భారత్ : 263 & 121