ETV Bharat / sports

లో స్కోరింగ్ మ్యాచ్​లో కెనడాదే విజయం - T20 World Cup 2024

Can vs Ire T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​లో భాగంగా కెనడా- ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. ఇందులో 12 పరుగుల తేడాతో ఐర్లాండ్​పై గెలిచిన కెనడా తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

Can vs Ire T20
Can vs Ire T20 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 10:59 PM IST

Updated : Jun 8, 2024, 6:27 AM IST

Can vs Ire T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​లో భాగంగా జరిగిన మ్యాచ్​లో కెనడా జట్టు అదరగొట్టింది. శుక్రవారం జరిగిన టోర్నీలో 12 పరుగుల తేడాతో ఐర్లాండ్​పై గెలిచి తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెనడా ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు ఆరోన్ జాన్సన్ (14), నవనీత్ ధలీవాల్ (6) పవర్​ ప్లేలోనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత పర్గత్ సింగ్ (18), దిల్​ప్రీత్ బజ్వా (7) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఇక మిడిలార్డర్​లో నికోలస్ కిర్టన్ (49 పరుగులు: 35 బంతుల్లో: 3x4, 2x6), శ్రేయస్ మోవ్వా (37 పరుగులు: 36 బంతుల్లో: 3x4) రాణించడం వల్ల కెనడా​కు ఆ మాత్రం స్కోరైనా దక్కింది. ఇక ఐర్లాండ్​ బౌలర్లలో క్రాగ్ యంగ్, బారీ మెక్​గ్రాత్ చెరో 2, దినానీ, మార్క్ ఆదిర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

Last Updated : Jun 8, 2024, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.