Bumrah Smrithi Mandhana ICC Players of Month June 2024 : టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ ఏడాది జూన్ నెలకుగానూ అతడు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో కీలకంగా వ్యవహరించినందుకుగానూ ఈ ఘనతను అందుకున్నాడు. మహిళా విభాగంలో భారత క్రికెటర్ స్మృతి మంధానకు ఈ అవార్డు దక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అదరగొట్టినందుకు ఈ అవార్డ్ లభించింది. కాగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒకే దేశానికి చెందిన పురుష, మహిళా క్రికెటర్లు ఒకే నెలలో విజేతలుగా నిలవడం ఇదే మొదటి సారి.
ఎంతో సంతోషంగా ఉంది : బుమ్రా మాట్లాడుతూ - "ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. అమెరికా- వెస్టిండీస్‌లో గడిపిన సమయం మధుర జ్ఞాపకాలను ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రత్యేక అవార్డు కూడా దక్కింది. జట్టుగా మేము సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే వ్యక్తిగతంగా నా ఖాతాలో ఈ గెలుపు చేరడం మరింత సంతోషంగా ఉంది" అని బుమ్రా పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ గెలవడం తన జీవితంలో మరచిపోలేని క్షణమని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో ఎనిమిది మ్యాచులు ఆడిన బుమ్రా 4.17 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీశాడు. అఫ్గానిస్థాన్ పేసర్ ఫజల్ హక్ ఫారుకీ(17), టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్(17) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు బుమ్రా. టీమ్ఇండియా ఛాంపియన్‌గా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. ఈ విజయం ఇంకా మర్చిపోకముందే ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా అందుకున్నాడు.
రోహిత్‌పై గెలిచి - ఈ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డును ఓట్ల ద్వారా విజేతను నిర్ణయిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విభాగంలో బుమ్రాతో పాటు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అఫ్గాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ కూడా పోటీపడ్డారు. కానీ చివరికి జూన్ నెలకుగానూ విజేతగా నిలిచాడు బుమ్రా.
ద్రవిడ్‌కు ఆ ఐపీఎల్ టీమ్ బ్లాంక్ చెక్ ఆఫర్! - ఏ రోల్ కోసమంటే? - IPL 2025 Rahul Dravid
BCCI నెట్‌వర్త్ రూ.19,000 కోట్లు! - బోర్డుకు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా? - BCCI Net worth