Border Gavaskar Trophy IND VS AUS Teamindia Player Records : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ మరో రోజులో ప్రారంభం కానుంది. నవంబర్ 22 నుంచే ఆస్ట్రేలియా, భారత్ మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. అయితే ఈ సిరీస్ మన ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇంతకీ అవేంటంటే?
భారీ రికార్డులపై కోహ్లీ కన్ను
- విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో 458 పరుగులు చేయగలిగితే దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ 1,809 పరుగుల రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడు. తద్వారా ఆసీస్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా నిలుస్తాడు. కంగారుల గడ్డపై విరాట్ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడాడు. 54.08 యావరేజ్‌తో 1,352 రన్స్ చేశాడు.
- ఈ టూర్లో విరాట్ 574 పరుగులు చేయగలిగితే ఆస్ట్రేలియాలో 4 వేల రన్స్ కంప్లీట్ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు కెక్కుతాడు.
- బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా సచిన్ తెందుల్కరే తొమ్మిది సెంచరీలు చేశాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ చెరో 8 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. కాబట్టి ఈ సిరీస్‌లో సచిన్ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది.
- ఈ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కోహ్లీ 4 శతకాలు సాధిస్తే, ఆసీస్ గడ్డపై 10 టెస్ట్ శతకాలు చేసిన మొదటి విదేశీ ప్లేయర్‌గానూ ఘనత సాధిస్తాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జాక్ హాబ్స్ తొమ్మిది శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
- కోహ్లీ మరో ఐదు శతకాలు బాదితే ఆసీస్‌పై అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలుస్తాడు. సచిన్ తెందూల్కర్ 20 శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
- అడిలైడ్ ఓవల్ స్టేడియంలో విరాట్‌కు మంచి రికార్డ్ ఉంది. ఈ మైదానంలో నాలుగు టెస్టులు ఆడిన కోహ్లీ, 509 రన్స్ చేశాడు. మరో 102 పరుగులు చేస్తే బ్రియాన్ లారా 610 పరుగులును దాటి అత్యధిక రన్స్ చేసిన విదేశీ ప్లేయర్‌గా రికార్డుకెక్కుతాడు.
- అడిలైడ్ ఓవల్ స్టేడియంలో విరాట్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఐదు శతకాలు బాదాడు. అక్కడ మరో శతకం చేస్తే జాక్ హాబ్స్ 5 సెంచరీలును దాటడంతో పాటు ఈ స్టేడియాలో 1,000 రన్స్ చేసిన తొలి విదేశీ ప్లేయర్‌గా నిలుస్తాడు.
- ఈ సిరీస్‌లో విరాట్ ఆస్ట్రేలియాతో 100వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నాడు. గబ్బా వేదికగా (బ్రిస్బేన్) జరిగే మూడో టెస్టుతో ఈ ఘనత అందుకోవచ్చు. ఇప్పటివరకు సచిన్ మాత్రమే ఆస్ట్రేలియాతో వంద కన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా ఆసీస్‌తో 110 మ్యాచ్‌ల్లో తలపడ్డాడు.
అశ్విన్ మరో 6 వికెట్లు
- బోర్డర్-గావస్కర్ ట్రోఫీ హిస్టరీలో అత్యధిక వికెట్ల జాబితాలో స్పిన్నర్లు నాథన్ లైయన్, అశ్విన్ మధ్య గట్టి పోటీ ఉంది. ప్రస్తుతం లైయన్ 116 వికెట్లతో టాప్‌లో ఉండగా అశ్విన్ 114 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాబట్టి తాజా సిరీస్‌లో ఎవరు అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తారో.
- టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డబ్ల్యూటీసీ హిస్టరీలో ఇప్పటివరకు 194 వికెట్లు తీశాడు. మరో 6 వికెట్లు తీస్తే డబ్ల్యూటీసీలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధిస్తాడు.
బుమ్రా మరో 20 వికెట్లు
- ఈ సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మరో 20 వికెట్లు తీస్తే కపిల్ దేవ్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుకెక్కుతాడు. బుమ్రా ఆసీస్‌లో ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడాడు. 32 వికెట్లు పడగొట్టాడు.
రోహిత్ మరో 11 సిక్స్‌లు
- ఈ బోర్డర్ గావస్కర్ ట్రోఫీ హిస్టరీలో సచిన్ తెందూల్కర్ అత్యధికంగా 25 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ మరో 11 సిక్స్‌లు బాదితే సచిన్‌ను బ్రేక్ చేయొచ్చు.
టీమ్ ఇండియాను వెంటాడుతోన్న ఆ సమస్య - బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో వాళ్లకు కఠిన పరీక్షే
బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి బుమ్రా స్పెషల్ ఛాయిస్ - సర్‌ప్రైజ్ ఫైనల్ XI ఇదేనా?