ETV Bharat / sports

BCCI నెట్‌వర్త్‌ రూ.19,000 కోట్లు! - బోర్డుకు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా? - BCCI Net worth - BCCI NET WORTH

BCCI Net worth : ప్రపంచంలోనే బీసీసీఐ అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డనే సంగతి తెలిసిందే. ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్​ వల్ల బీసీసీఐకి ఈ స్థాయిని అందుకుంది. మరి బీసీసీఐకి ఆదాయం ఎలా, ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా? పూర్తి వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.

source ANI
BCCI (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 9:54 PM IST

BCCI Net worth : ఇటీవల 2024 టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల క్యాష్‌ ప్రైజ్‌ను అనౌన్స్‌ చేసింది. కొందరికి అమ్మో! ఇంత డబ్బా? అనిపించవచ్చు. అయితే ప్రపంచంలోనే బీసీసీఐ రిచెస్ట్‌ క్రికెట్‌ బోర్డని గుర్తించాలి. బీసీసీఐ వద్ద ఉన్న అసెట్స్‌ గురించి తెలిస్తే, అంత క్యాష్‌ ప్రైజ్‌ ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదనిపిస్తుంది.

బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బీసీసీఐ) 1928 డిసెంబర్‌లో ఏర్పాటైంది. ఇది భారతదేశంలో క్రికెట్‌కు పాలకమండలి. అప్పటి నుంచి బీసీసీఐ క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. బోర్డు అంతర్జాతీయ మ్యాచ్​లు మాత్రమే కాకుండా రంజీ ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి డొమెస్టిక్‌ టోర్నమెంట్‌లను కూడా నిర్వహిస్తోంది.

  • బీసీసీఐ నెట్‌వర్త్‌ ఎంత?
    ఎన్డీటీవీ నివేదిక ప్రకారం, బీసీసీఐ నెట్‌ వర్త్‌ USD 2.25 బిలియన్లు (సుమారు రూ.19,000 కోట్లు). క్రిక్‌బజ్ ప్రకారం, రూ.660 కోట్ల నెట్‌వర్త్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. మొదటి, రెండో స్థానం మధ్య ఉన్న భారీ వ్యత్యాసం చూస్తే బీసీసీఐ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

    భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌తోనే బీసీసీఐ నెట్‌వర్త్‌ పెరిగింది. భారతదేశంలో కొన్ని కోట్ల మంది క్రికెట్‌ను ఫాలో అవుతారు. దీంతో భారత మ్యాచ్‌లకు, ఐపీఎల్‌కు అధిక మ్యాచ్ వ్యూయర్‌షిప్, లాభదాయకమైన బ్రాడ్‌కాస్టింగ్‌ డీల్స్‌ లభిస్తాయి.
  • బీసీసీఐ ఆదాయం, ఖర్చులు
    మింట్ నివేదిక ప్రకారం, 2021-2022 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ.7,606 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఆ సమయంలో బోర్డు ఖర్చులు రూ.3,064 కోట్లు. ఆ సంవత్సరానికి రూ.1,159 కోట్ల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కూడా చెల్లించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-2021లో బీసీసీఐ ఆదాయం రూ.4,735 కోట్లు, ఖర్చులు రూ.3,080 కోట్లు.
  • ప్రధాన ఆదాయ మార్గాలు ఏంటి?
    బీసీసీఐకి ప్రధానంగా నాలుగు ప్రైమరీ సోర్సెస్‌ నుంచి రెవెన్యూ జనరేట్‌ చేస్తుంది. అవి మీడియా రైట్స్‌, స్పాన్సర్‌షిప్ రైట్స్‌, ఐసీసీ రెవిన్యూ షేర్‌, టిక్కెటింగ్‌ రైట్స్‌.
  • మీడియా, స్పాన్సర్‌షిప్ హక్కులు
    ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, 2018లో స్టార్ స్పోర్ట్స్ ఇండియా టెలివిజన్ అండ్​ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు బీసీసీఐ మీడియా రైట్స్‌ పొందింది. రూ.6,138 కోట్ల ఆఫర్‌తో అధిగమించింది.

    2023 ఆగస్ట్‌లో Viacom18, టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ హక్కులను సొంతం చేసుకుంది. 2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి వరకు రూ.5,963 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఐసీసీ ఈవెంట్ మీడియా రైట్స్‌ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌ తీసుకుంది.
  • ఐపీఎల్ మీడియా రైట్స్‌
    2022లో, 2023-2027కి సంబంధించిన IPL మీడియా రైట్స్‌ రూ.48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. భారత ఉపఖండం టెలివిజన్ రైట్స్‌ను స్టార్ రూ.23,575 కోట్లకు పొందగా, వయాకామ్ 18 డిజిటల్ రైట్స్‌ని రూ.23,758 కోట్లకు కొనుగోలు చేసిందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఈ ఒప్పందంతో యునైటెడ్ స్టేట్స్‌లోని నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) తర్వాత, రెండో అత్యంత విలువైన స్పోర్ట్స్‌ ఈవెంట్‌గా ఐపీఎల్‌ నిలిచింది.

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే! - భారత్‌,పాక్ మ్యాచ్‌ ఎప్పుడంటే? - ICC Champions Trophy 2025 Schedule

  • స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు
    2023 ఆగస్ట్‌లో బీసీసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్‌ను వారి కొత్త టైటిల్ స్పాన్సర్‌గా మూడేళ్లపాటు ప్రకటించింది. మింట్ ప్రకారం, ఈ ఒప్పందం ప్రకారం ఐడీఎఫ్‌సీ బ్యాంక్, బీసీసీఐకి ఒక్కో మ్యాచ్‌కు రూ.4.2 కోట్లు చెల్లిస్తుంది. గతంలో టైటిల్ స్పాన్సర్ అయిన పేటీఎం, నాలుగు సంవత్సరాలకు రూ.326.80 కోట్లు చెల్లించినట్లు హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొంది.

    2023 మేలో, BCCI అడిడాస్‌తో ఐదు సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. ఆడిడాస్‌ను టీమ్ ఇండియాకు అధికారిక కిట్ స్పాన్సర్‌గా చేసింది. ఈ డీల్ విలువ రూ.250 కోట్లు. అడిడాస్ ఒక్కో మ్యాచ్‌కు రూ.75 లక్షల చొప్పున బీసీసీఐకి చెల్లిస్తోంది. అంతకు ముందు ఒప్పందం చేసుకున్న నైక్‌ ప్రతి మ్యాచ్‌కు రూ.88 లక్షలు చెల్లించేది. గత స్పాన్సర్‌షిప్ కంటే ఇప్పుడున్నది కొంచెం తక్కువ.

    అదనంగా, ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్‌ 11, 2027 వరకు టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా ఉండేందుకు గత సంవత్సరం BCCIతో ఐదేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ స్పాన్సర్‌షిప్ ఒప్పందం విలువ సుమారు రూ. 358 కోట్లు.

  • టిక్కెటింగ్‌ రైట్స్‌

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాలు భారత్‌లో ఉన్నాయి. టిక్కెట్ల విక్రయాలు బీసీసీఐ ఆదాయానికి గణనీయంగా దోహదం చేస్తున్నాయి. 2023 ఆగస్ట్‌లో, బీసీసీఐ బుక్‌మైషోను ఐసీసీ మెన్స్‌ క్రికెట్ ప్రపంచ కప్ 2023కి టిక్కెట్ ప్లాట్‌ఫామ్‌గా ప్రకటించింది. సంవత్సరం ప్రారంభంలో, పేటీఎం ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కి టిక్కెటింట్‌ పార్ట్‌నర్‌గా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు అధికారిక టిక్కెటింగ్‌ పార్ట్‌నర్‌ కావడానికి బీసీసీఐకి డబ్బు చెల్లిస్తాయి.

జట్టు జెర్సీలు, స్మృతి చిహ్నాలు, ఇతర క్రికెట్ వస్తువుల విక్రయం కూడా బీసీసీఐ ఆదాయాన్ని పెంచుతుంది. ఈ ఉత్పత్తులకు లైసెన్సింగ్ ఒప్పందాలు అత్యంత లాభదాయకంగా ఉంటాయి.

  • ఐసీసీఐ రెవెన్యూ షేర్‌

గతేడాది జులైలో ఐసీసీ ఆదాయంలో బీసీసీఐకి ఎక్కువ రెవెన్యూ లభించింది. 2023 నుంచి 2027 వరకు, బోర్డు ఐసీసీ నుంచి దాదాపు $230 మిలియన్లు (దాదాపు రూ. 2,000 కోట్లు) సంపాదించనుంది. ఇది ఐసీసీ రెవెన్యూలో దాదాపుగా 38.5% వాటాను కలిగి ఉంది.

ఇంగ్లాండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు మొత్తం ఆదాయంలో 6-7% మధ్య పొందుతాయి.

గతంలో, 2015-2023 సైకిల్‌లో BCCI సంవత్సరానికి $46.7 మిలియన్లు (సుమారు రూ. 390 కోట్లు) సంపాదించింది. ఇది ICC నికర వార్షిక ఆదాయంలో 22.8% కావడం గమనార్హం.

'మాకు ప్రైజ్​మనీ ఇవ్వండి సార్' - 1983 వరల్డ్​కప్​ విన్నర్​ కపిల్​దేవ్​ టీమ్​​ డిమాండ్​! - T20worldcup 2024 prize Money

టీమ్​ఇండియా బ్యూటీ స్మృతి మందాన - ఇప్పుడు ఎవరితో డేటింగ్ చేస్తుందో తెలుసా? - Smrithi Mandhana Boyfriend

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.