Rohit Virat Test Retirement : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్వదేశంలో తమ ఆఖరి టెస్టు సిరీస్ ఆడేశారా? దిగ్గజ స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మన పిచ్‌లపై చివరిసారిగా బౌలింగ్ చేసేశారా? ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఊహించని రీతిలో పరాజయం ఎదురైన తర్వాత టీమ్ఇండియా సీనియర్ల టెస్టు భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది.
తాజాగా కివీస్‌పై ఓటమి పట్ల బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. గత కొంతకాలంగా టెస్టు ఫార్మాట్ ఫ్యూచర్ కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఫలితం రావడం వల్ల బీసీసీఐ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టెస్టు జట్టులో సమూల మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోందట. ముఖ్యంగా సీనియర్లు రోహిత్, విరాట్, జడేజా, అశ్విన్ టెస్టు భవితవ్యంపై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
#TeamIndia came close to the target but it's New Zealand who win the Third Test by 25 runs.
— BCCI (@BCCI) November 3, 2024
Scorecard - https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/4BoVWm5HQP
ఇక టీమ్ఇండియాకు 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బోర్డర్ గావస్కర్ టోఫ్రీని 4-0తో నెగ్గితేనే భారత్ మూడోసారి ఫైనల్ చేరుకుంటుంది. అయితే ఈ సిరీస్‌కు ఇప్పటికే జట్టును ప్రకటించిన నేపథ్యంలో స్వాడ్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ సిరీస్‌లో టీమ్ఇండియా విఫలమై WTC, ఫైనల్ చేరకపోతే వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో జట్టులో ఈ నలుగురు సీనియర్లకు చోటు ఉండదని బోర్డు మెంబర్ ఒకరు పేర్కొన్నట్లు తెలిసింది
కాగా, బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని టీమ్ఇండియా 4-0తో దక్కించుకుంటేనే మూడోసారి ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే అందత ఈజీగా అయ్యే పని కాదు. బలమైన ఆస్ట్రేలియా జట్టును వాళ్ల సొంత గడ్డపై ఓడించడం మామూలు విషయం కాదు. పూర్తిగా పేస్‌కు సహకరించే పిచ్‌లపై బుల్లెట్‌లాంటి బంతులు ఎదుర్కోవడం కష్టమనే చెప్పాలి.
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్
- తొలి టెస్టు : నవంబర్ 22- నవంబర్ 26 - పెర్త్
- రెండో టెస్టు : డిసెంబర్ 06- డిసెంబర్ 10- కాన్బెర్రా
- మూడో టెస్టు : డిసెంబర్ 14- డిసెంబర్ 18- బ్రిస్బేన్
- నాలుగో టెస్టు : డిసెంబర్ 26- డిసెంబర్ 30- మెల్బోర్న్
- ఐదో టెస్టు : జనవరి 03- జనవరి 07- సిడ్ని
స్వదేశంలో ఘోర వైఫల్యం! - బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో రోహిత్ ఆడుతాడా?
'వాళ్లు రోహిత్ వీక్నెస్ తెలుసుకున్నారు!- బోర్డర్ గావస్కర్లోనూ ఇలా జరిగితే ఇక అంతే!'