Australia Women vs South Africa Women : కొన్ని సార్లు క్రికెట్లో పలు అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. అందులో కొన్ని నవ్వులు పూయ్యించేలా ఉండగా, మరికొన్ని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మహిళల మూడో వన్డేలో ఇటువంటి ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అదేంటంటే.
ఒక బాల్ మూడు గోల్స్
అయితే శనివారం జరిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఒకే బంతికి నో బాల్, హిట్ వికెట్, సిక్సర్ పడింది. 48వ ఓవర్ ఆఖరి బంతిని సౌతాఫ్రికా పేసర్ క్లాస్ నో బాల్‌గా వేయగా ఇది జరిగింది. తొలుత ఆ నో బాల్‌ను అలన కింగ్ భారీ షాట్ కొట్టేందుకు యత్నించింది. అయితే ఈ క్రమంలో ఆమె అదుపుతప్పి కిందపడగా, అక్కడే ఉన్న వికెట్లకు బ్యాటు తాకించి హిట్ వికెట్ అయ్యింది. ఇదంతా జరగుతుండగా, అదే బంతి సిక్సర్‌గా మారింది. అయితే దీన్ని అంపైర్ నో బాల్‌గా ప్రకటించడం వల్ల అలన ఔటవ్వడం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
-
Alana King manages to hit a six - and her own wicket - off the same ball!
— cricket.com.au (@cricketcomau) February 10, 2024
It's all happening! #AUSvSA pic.twitter.com/PrsVvkNvL0
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకుగానూ 277 పరుగులు చేసింది. 5 పరుగులు ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ ఔటవ్వడం వల్ల ఆస్ట్రేలియా జట్టు తొలుత డీలా పడింది. అయితే ఆ తర్వాత మైదానంలోకి దిగిన ఎలిసా పెరీ (24), కెప్టెన్ హీలీ (60)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. రెండో వికెట్ సమయానికి ఈ ఇద్దరు 82 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన తహిల (44), బెత్ మూనీ (82), తమ స్కోర్‌తో జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించారు. మరోవైపు సౌతాఫ్రికా బౌలర్లలో క్లాస్ నాలుగు వికెట్లతో చెలరేగింది. ఇక మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా చేజిక్కిచుకోగా, రెండో వన్డే సౌతాఫ్రికా నెగ్గింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 84 పరుగుల తేడాతో విజయం సాధించింది.
INDw vs AUSw : మ్యాచ్‌ను మలుపు తిప్పిన రనౌట్.. 'అంత కన్నా దురదృష్టం లేదు'
ఏడోసారి ప్రపంచకప్ నెగ్గిన ఆసీస్.. ఫైనల్లో ఇంగ్లాండ్ చిత్తు