Australia A vs India A 2nd Test KL Rahul : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముంగిట ఆసీస్-ఏ జట్టుతో జరిగిన అనధికార టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే ఔట్ అయిన రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచాడు. దీంతో రాహుల్ ఔట్ అయిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రాహుల్ పై విమర్శలు - ఆసీస్ స్పిన్నర్ కోరె రొచ్చిసియోలీ వేసిన బంతి లెగ్ సైడ్ వెళ్లిపోతుందని భావించిన రాహుల్ దాన్ని వదిలేశాడు. అయితే బంతి అతడి ప్యాడ్‌ను తాకి రెండు కాళ్ల మధ్య నుంచి వెళ్లి వికెట్లను తగిలింది. ఆస్ట్రేలియా బౌలర్ వేసిందేమీ అద్భుతమైన బంతి కానప్పటికీ, రాహుల్ బ్రెయిన్ ఫేడ్ మూమెంట్ కారణంగా అతడికి వికెట్ దక్కింది. లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని వదిలేయకుండా డిఫెన్స్ ఆడినా సరిపోయేది. కానీ రాహుల్ మాత్రం తప్పుడు అంచనాతో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో వికెట్ పారేసుకోవడానికి రాహుల్ కొత్త దార్లు వెతుక్కుంటున్నాడంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు.
రాహుల్ కీలకమని భావించి! - న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్ అవ్వడంతో టీమ్ ఇండియాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంతగడ్డపై బెబ్బులి లాంటి టీమ్ ఇండియా ఇంత దారుణంగా ఓడటంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బందులు పడుతున్న భారత్, ఆ సిరీస్‌లో ఎలా నెట్టుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్టైలిస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీమ్‌కు కీలకం కానున్నాడని అంతా భావించారు. అతడి బ్యాటింగ్ శైలి ఆ పిచ్‌లకు సరిపోతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు రాహుల్ ఆటతీరు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగి నిరాశపర్చాడు.
పోరాడుతున్న భారత్! - ఆసీస్- ఏ టీమ్‌తో జరుగుతున్న అనధికార టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఏ జట్టు ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ధృవ్ జురెల్ (19 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (9 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. టీమ్ ఇండియా ప్రస్తుతం 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 223 పరుగులు చేయగా, భారత్ 161 రన్స్ కే చాపచుట్టేసింది.
KL Rahul's unusual dismissal Vs Australia A. 🥹💔pic.twitter.com/Ox6R2OGj9w
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 8, 2024
మొసళ్ల నదిలో పడిపోయిన మాజీ క్రికెటర్ - ఇప్పుడు అతడి పరిస్థితి ఎలా ఉందంటే?
చెఫ్‌గా మారిన సూర్య కుమార్ - రెండు సూపర్ క్రికెట్ రెసిపీలతో!