Afghanistan vs South Africa 2nd ODI : Afghanistan vs South Africa 2nd ODI : ఆఫ్గానిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శనతో అగ్రశ్రేణి జట్టు దక్షిణాఫ్రికాకు అనూహ్య షాక్ ఇచ్చింది. సౌతాఫ్రికా జట్టుపై వరుసగా రెండో వన్డేలోనూ గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిందీ మ్యాచ్. తద్వారా ఇంకో వన్డే మిగిలి ఉండగానే ప్రత్యర్థి జట్టుపై 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది అఫ్గాన్. దీంతో తొలిసారి ఆ జట్టు వన్డే సిరీస్‌ను దక్కించుకున్నట్టైంది.
అఫ్గాన్ ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో 177 పరుగుల తేడాతో సఫారీ జట్టు ఓటమిని అందుకుంది. దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్‌కు దూరమైన అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్(Rashid Khan Five Wickets) రెండో మ్యాచు బరిలోకి దిగి ఐదు వికెట్లు తీశాడు. రహ్మానుల్లా గుర్బాజ్ సెంచరీతో(105 పరుగులు, Rahmanullah Gurbaz Century) మెరిశాడు.
కాగా, ప్రస్తుతం అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయం సాధించడంతో ఆ జట్టు ప్లేయర్ల సంబరాలు అంబరాన్నంటాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ సాగిందిలా - రెండో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగింది అఫ్గానిస్థాన్. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 105 పరుగులు చేసి సెంచరీతో ఆకట్టుకున్నాడు. అజ్మతుల్లా ఓమర్‌జాయ్ 86 పరుగులు, రహ్మత్ షా 50 పరుగులతో రాణించారు. దీంతో అఫ్గానిస్థాన్ భారీ స్కోర్ చేయగలిగింది.
అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది దక్షిణాఫ్రికా. ప్రారంభంలోనే వరుసగా వికెట్లను కోల్పోయింది. నిర్ణీత 34.2 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. సౌతాఫ్రికా తరుపున కెప్టెన్ టెంబ బవుమా(Temba Bavuma vs Afghanisthan) ఒక్కడే 38 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఖరోటే 4 వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచులో అద్భుతంగా రాణించిన రషీద్ ఖాన్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇకపోతే మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా నామమాత్రమైన చివరి వన్డే షార్జా వేదికగా ఆదివారం జరగనుంది.
సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రోహిత్, విరాట్ నిరాశ- 308 రన్స్ లీడ్‌లో భారత్ - IND VS BAN Test Series 2024