ఒక్క విజయం- గ్రాండ్ సెలబ్రేషన్స్- పీక్స్‌లో అఫ్గాన్ ఆటగాళ్ల సంబరాలు - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024
Afg vs Aus World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో అసీస్‌పై విజయంతో అఫ్గాన్ ప్లేయర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విక్టరీని అఫ్గాన్ ఆటగాళ్లతో పాటు ఆదేశ క్రికెట్ ఫ్యాన్స్ కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.


Published : Jun 23, 2024, 1:07 PM IST
|Updated : Jun 23, 2024, 1:24 PM IST
Afg vs Aus World Cup 2024: 2024 టీ20 వరల్డ్‌కప్ సూపర్- 8లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత అఫ్గానిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఓటమికి తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ బలమైన ఆస్ట్రేలియా జట్టుపై ఆల్‌రౌండ్ ఆధిపత్యం చలాయిస్తూ 21 పరుగుల తేడాతో నెగ్గి చారిత్రక విజయాన్ని అందుకుంది.
దీంతో అఫ్గానిస్థాన్ ప్లేయర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సంబరాలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. మ్యాచ్ అనంతరం మైదానంలో ప్రారంభమైన అఫ్గాన్ ఆటగాళ్ల సంబరాలు టీమ్ బస్సులోనూ కొనసాగాయి. జట్టు కోచ్ డ్వేన్ బ్రావో 'ఛాంపియన్' పాటకు ప్లేయర్లంతా బస్సులోనే స్టెప్పులేస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. గ్రౌండ్ నుంచి హోటల్‌కు వెళ్తున్న బస్సులో అఫ్గాన్ ప్లేయర్ల సెలబ్రేషన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అఫ్గాన్‌లోనూ సంబరాలు: ఈ సంచలన విజయం తర్వాత అఫ్గానిస్థాన్ దేశంలోనూ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అఫ్గాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌లో క్రికెట్ ఫ్యాన్స్ తమ ప్లేయర్ల విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేచ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Afghanistan Semis Chances: ఇక ఈ విజయంలో అఫ్గాన్ తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సూపర్- 8లో తమ ఆఖరి మ్యాచ్‌లో అఫ్గాన్, బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో నెగ్గి, ఆసీస్ తన ఆఖరి మ్యాచ్‌లో ఓడితే అఫ్గాన్‌కు సెమీస్‌లో బెర్తు కన్ఫార్మ్ అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
అప్పుడే ఓడించాల్సింది!
'ఆస్ట్రేలియాపై నెగ్గడం మా జట్టుకు, దేశానికి ఎంతో చాలా ప్రత్యేకం. ఆసీస్‌పై విజయం మాకు మంచి అనుభూతి. 2023 వన్డే వరల్డ్‌కప్‌లోనే దీన్ని పొందాల్సింది. గుర్భాజ్- ఇబ్రహీం ఓపెనింగ్ జోడీ అదరగొట్టింది. ఈ పిచ్‌పై 140 మంచి స్కోరే. మాకు దక్కిన ఘనమైన ఆరంభం వల్లే మేం ఆ స్కోర్ చేయగలిగాం. కాస్త కష్టపడితే ఈ స్కోర్ కాపాడుకోవచ్చని అనిపించింది' అని మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు.
ఇంట్రెస్టింగ్గా వరల్డ్‌కప్ సెమీస్ రేస్- భారత్‌కు ఛాన్స్ ఎంతంటే?
ఆసీస్‌పై 'అఫ్గాన్' సంచలన విజయం- ఈసారి గురి తప్పలేదు! - T20 World Cup 2024