Delhi Premier League 6 Balls 6 Sixes: దిల్లీ ప్రీమియర్ లీగ్ 2024లో 23ఏళ్ల యువ క్రికెటర్ ప్రియాన్ష్ ఆర్య సంచలనం సృష్టించాడు. లీగ్‌లో సౌత్ దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాన్ష్ శనివారం నార్త్ దిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. మ్యాచ్ 12వ ఓవర్లో వరుసగా ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు బాది ఔరా అనిపించాడు. మనన్ భరద్వాజ్ వేసిన ఈ ఓవర్లో ప్రియాన్ష్ 36 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రియాన్ష్ 50 బంతుల్లోనే 120 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి.
ఇక మరోవైపు ఆయూశ్ బదోనీ కూడా బీభత్సం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బదోనీ భారీ ఇన్నింగ్స్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 55 బంతుల్లోనే 165 పరుగులతో రెచ్చిపోయాడు. 300 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ ఏకంగా 19 సిక్స్‌లు బాదాడు. దీంతో టీ20లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా రికార్డు కొట్టాడు. ఈ క్రమంలోనే విండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ (18 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
6️⃣ 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 🤩
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 31, 2024
There’s nothing Priyansh Arya can’t do 🔥#AdaniDPLT20 #AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad | @JioCinema @Sports18 pic.twitter.com/lr7YloC58D
కాగా, వీరిద్దరి దెబ్బకు దిల్లీ సౌత్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 308 భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో దిగిన నార్త్ దిల్లీ ఓవర్లన్నీ ఆడి ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులే చేయగలిగింది. దీంతో 112 పరుగుల భారీ తేడాతో సౌత్ దిల్లీ ఈ మ్యాచ్‌లో నెగ్గింది.
🏔️ A mountainous total on board and a historic innings by South Delhi Superstarz 🔥👏
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 31, 2024
The stage is set for an epic chase in #AdaniDPLT20! Watch all the action live on JioCinema and Sports 18 2! 💥#AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad pic.twitter.com/usSuUAlU3g
ప్రియాన్ష్ అన్‌స్టాపబుల్
అయితే యువ బ్యాటర్ ప్రియాన్ష్ ప్రస్తుత దిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అదరగొడుతున్నాడు. నిలడకగా ఆడుతూ సత్తా చాటుతున్నాడు. ప్రియాన్ష్ ఇప్పటికే 57 (30), 82 (51), 53 (32), 45 (26), 107*(55), 88 (42), 24 (9) స్కోర్లు నమోదు చేశాడు. దీంతో రానున్న ఐపీఎల్ మెగా వేలంలో ఫ్రాంచైజీల కళ్లు ప్రియాన్ష్‌పై ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
లఖ్‌నవూ నయా స్టార్- 'ఒత్తిడిలో ఆడాలా? అయితే బదోనీని పిలవాల్సిందే' - Ayush Badoni IPL
దీపక్ హుడా, ఆయుష్ బదోని హాఫ్ సెంచరీ.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే?