ETV Bharat / sports

IPL మెగా వేలానికి డేట్స్ ఫిక్స్- ఆక్షన్ జరిగేది ఎక్కడంటే?

2025 ఐపీఎల్ మెగా వేలం- తేదీలు ఖరారు- ఆక్షన్ ఎప్పుడంటే?

2025 IPL Mega Auction
2025 IPL Mega Auction (Source: IANS)
author img

By ETV Bharat Sports Team

Published : 20 hours ago

2025 IPL Mega Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం నవంబరు 22, 23 తేదీల్లో జరిగే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. అలాగే సౌదీ అరేబియా రాజధాని రియాద్ వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహించే ఛాన్స్‌ ఉందని పేర్కొన్నాయి. ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలానికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

వేలంలోకి దిగ్గజ ఆటగాళ్లు
కాగా, ఐపీఎల్ 2025 సీజన్​కు సంబంధించి పది ఫ్రాంఛైజీలు ఇటీవల రిటెన్షన్ లిస్టును వెల్లడించాయి. రూ. 558.5 కోట్ల పెట్టుబడి పెట్టి మొత్తం 46 మంది ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి. ఇందులో 36 మంది భారతీయులే ఉండటం గమనార్హం. అలాగే జోస్ బట్లర్, ఐడెన్ మార్ క్రమ్, గ్లెన్ మాక్స్‌ వెల్, డు ప్లెసిస్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు విడుదల చేశారు. దీంతో వీరందరూ ఐపీఎల్ 2025 మెగావేలంలోకి రానున్నారు.

తొలి టెస్టు మధ్యలోనే వేలం!
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ టెస్టు మధ్యలోనే ఐపీఎల్ వేలం నిర్వహిస్తారని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్​స్టార్‌ వేదికగా ఈ ఆక్షన్​ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆసీస్‌ టైమింగ్​కు ఎలాంటి ఇబ్బంది రాకుండా, రియాద్​లో మధ్యాహ్నం సమయంలో ఈ ఆక్షన్ నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సారి ఐపీఎల్‌ మెగా వేలంపై ఆసక్తి పెరిగిపోవడానికి కారణం భారత స్టార్లు ఉండటమే.

పంత్ భారీ ధర పలికే ఛాన్స్!
టీమ్​ఇండియా హిట్టర్ రిషభ్‌ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, అర్ష్​దీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ తదితరులు తమ లక్​ను ఈ మెగా వేలంలో పరీక్షించుకోనున్నారు. దూకుడు మీదున్న రిషభ్​ను ఎవరు సొంతం చేసుకుంటారనే దానిపైనే అభిమానులకు ఆసక్తి నెలకొంది. వేలంలో భారీ మొత్తం అతడే సొంతం చేసుకుంటాడని అంచనా వేస్తున్నారు. రిషభ్ కనీసం రూ. 25 కోట్లు దక్కించుకుంటాడని భావిస్తున్నారు. కేఎల్ రాహుల్‌ కూడా రూ. 20 నుంచి రూ. 25 కోట్లు సొంతం చేసుకుంటాడని భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్​ కెరీర్​పై విరాట్ హింట్- మరో మూడేళ్లు ఆర్సీబీతోనే!

2025 IPL రిటెన్షన్ లిస్ట్ ఔట్- మెగా వేలంలోకి ఐదుగురు కెప్టెన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.