ETV Bharat / sports

హైబ్రిడ్ మోడల్​కు ICC నో చెప్తే భారత్ పరిస్థితేంటి?- లంకకు బిగ్​ ఛాన్స్! - 2025 Champions Trophy

2025 Champions Trophy India: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమ్ఇండియా పాకిస్థాన్​కు వెళ్లదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. హైబ్రిడ్ మోడల్​లో భారత్ మ్యాచ్​లు నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరనుంది. ఒకవేళ ఈ హైబ్రిడ్ మోడల్​కు ఐసీసీ అంగీకరించకపోయినా, టీమ్ఇండియా పాకిస్థాన్​కు వెళ్లకపోయినా ఏం జరగనుందంటే?

2025 Champions Trophy India
2025 Champions Trophy India (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 3:34 PM IST

2025 Champions Trophy India: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 1996 తర్వాత తొలిసారి ఐసీసీ ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందింది. ఈ నేపథ్యంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్​కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. ఇందులో భాగంగా పాక్ సహా టోర్నీలో పాల్గొననున్న మరో 7జట్లు పాకిస్థాన్​ వెళ్లాల్సి ఉంది. అయితే భద్రత కారణాల దృష్యా టీమ్ఇండియా పాకిస్థాన్​కు వెళ్లడం కుదరదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. టీమ్ఇండియా ఆడే మ్యాచ్​లను తటస్థ వేదిక (దుబాయ్, శ్రీలంక)ల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేయాలని బీసీసీఐ ఐసీసీకి విజ్ఞప్తి చేయనుంది.

ఈ క్రమంలోనే బీసీసీఐ వచ్చే వారం కొలొంబోలో జరగనున్న ఐసీసీ సమావేశంలో బోర్డు అధికారుల ముందు ఈ విషయాన్ని ప్రస్తావించనుంది. అయితే గతేడాది పాకిస్థాన్ వేదికగా జరిగిన ఆసియా కప్​లో కూడా టీమ్ఇండియా హైబ్రిడ్ మోడల్​లోనే ఆడింది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ టోర్నీలో భారత్ మ్యాచ్​లన్నీ శ్రీలంకకు మార్చింది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అదే మోడల్​లో భారత్ మ్యాచ్​లు నిర్వహించాలని బీసీసీఐ కోరనుంది.

అయితే బీసీసీఐ రిక్వెస్ట్​కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, టీమ్ఇండియా పాకిస్థాన్​కు వెళ్లకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. టోర్నీలో భారత్ మ్యాచ్​లన్నీ తటస్థ వేదికలు దుబాయ్ లేదా శ్రీలంక మైదానాల్లో జరగడం ఖాయం. ఒకవేళ ఈ హైబ్రిడ్ మోడల్​కు ఐసీసీ ఆమోదం తెలుపకపోయినా, టీమ్ఇండియా పాకిస్థాన్​కు వెళ్లకపోయినా ఏంటి పరిస్థితి? భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా?

అయితే సాధారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు జరిగిన వన్డే వరల్డ్​కప్​ పాయింట్ల పట్టికలో టాప్- 8లో ఉన్న జట్లు ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. అలా 2023 వరల్డ్​కప్​ పాయింట్ల ప్రకారం టాప్-8లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి.

ఒకవేళ హైబ్రిడ్ మోడల్​ను ఐసీసీ అంగీకరించకున్నా, టీమ్ఇండియా పాక్​కు వెళ్లకున్నా భారత్ టోర్నీని విత్​డ్రా చేసుకోవాల్సి ఉంటుింది! అంటే భారత్ టోర్నీలో పాల్గొనదు. దీంతో 2023 వరల్డ్​కప్​లో 9వ స్థానంలో ఉన్న శ్రీలంక ఆటోమేటిక్​గా టోర్నీకి అర్హత సాధిస్తుంది. టీమ్ఇండియా స్థానం శ్రీలంకకు దక్కుతుంది. అయితే టీమ్ఇండియా టోర్నీని విత్​డ్రా చేసుకునే పరిస్థితి దాదాపు ఉండదు. బీసీసీఐ ప్రతిపాదనకు ఐసీసీ పాజిటివ్​గానే రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో? కాగా, 2025 ఫిబ్రవరి- మార్చిలో ఈ టోర్నీ జరగనుంది.

'పాకిస్థాన్ వెళ్లే ఛాన్సే లేదు, మా మ్యాచ్​లు అక్కడ పెట్టండి'

పాకిస్థాన్​కు టీమ్​ఇండియా - మరోసారి స్పందించిన బీసీసీఐ! - Champions Trophy 2025

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.