2024 Most Runs In Cricket: 2024 అండర్- 19 వరల్డ్ కప్ సహా ఈ ఏడాది చాలా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. ప్రస్తుతం భారత్- ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కూడా జరుగుతోంది. ఈ సిరీస్‌లో 2-1తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా- పాకిస్థాన్ సిరీస్, ఆస్ట్రేలియా- న్యూజిలాండ్, శ్రీలంక- బంగ్లాదేశ్ ఇలా టాప్ దేశాలన్నీ ద్వైపాక్షిక సిరీస్‌లతో క్రికెట్ లవర్స్‌కు కావాల్సినంత వినోదం పంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లెవరో ఓ సారి చూద్దామా..?
- యశస్వి జైస్వాల్: టీమ్ఇండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ లిస్టులో ముందున్నాడు. అతను ఈ ఏడాది రెండు ఫార్మాట్లలో 10 ఇన్నింగ్స్‌ల్లో 645 పరుగులు సాధించాడు. గతేడాదే ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ 22 ఏళ్ల కుర్రాడు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అదరగొడుతున్నాడు. 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.
- కేన్ విలియమ్సన్: న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో రఫ్పాడిస్తున్నాడు. ఇప్పటికే 6 ఇన్నింగ్స్‌ల్లో ఆడి 486 రన్స్ కొట్టాడు. అందులో రీసెంట్గా సౌతాఫ్రికాతో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టులో రెచ్చిపోయాడు. ఏకంగా 403 పరుగులతో సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
- నిస్సంక: శ్రీలంక ఆటగాడు పాథుమ్ నిస్సంక ఈ ఏడాది 6 ఇన్నింగ్స్‌లో 479 పరుగులు సాధించాడు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డేలో డబుల్ సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. పైగా లంక తరఫున తొలి ద్విశతకం చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
- రోహిత్ శర్మ: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. హిట్‌మ్యాన్ 11 ఇన్నింగ్స్‌లో 416 స్కోర్ సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ మూడో మ్యాచ్‌లో శతకంతో అదరగొట్టాడు.
- కెండెల్ కదొవాకీ ఫ్లెమింగ్: క్రికెట్ ప్రియులకు పరిచయం లేని జపాన్ ప్లేయర్ కెండెల్ కదొవాకీ ఫ్లెమింగ్ 9 ఇన్నింగ్స్‌లో 411 రన్స్ కొట్టాడు. ఇటీవల ముగిసిన అండర్- 19 వరల్డ్ కప్‌లో ఫ్లెమింగ్ ఈ పరుగులు నమోదు చేశాడు.
- ఇబ్రహీమ్ జర్దాన్: అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ ఇబ్రహీమ్ జర్దాన్ ఈ ఏడాది కూడా అత్యుత్తమ ఫామ్ కొనసాగిస్తున్నాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 378 పరుగులు బాదాడు.
- రచిన్ రవీంద్ర: న్యూజిలాండ్ యంగ్ టాలెంటెడ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. 2024లో 6 ఇన్నింగ్స్‌లు ఆడి 370 రన్స్ బాదాడు. కాగా, గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో రచిన్ కివీస్ జట్టుకు కీలకంగా వ్యవహరించాడు.
- కుశాల్ మెండిస్: మరో శ్రీలంకన్ ఆటగాడు కుశాల్ మెండిస్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. మెండిస్ 13 ఇన్నింగ్స్‌లో 359 పరుగులు చేశాడు.
- శుభ్‌మన్ గిల్: టీమ్ఇండియా మరో యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కూడా 2024లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. అతడు ఇప్పటివరకూ 9 ఇన్నింగ్స్‌లో గిల్ 321 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మొదట్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న గిల్, మూడో మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
- సదీర సమరవిక్రమ: శ్రీలంక బ్యాటర్ సదీర సమరవిక్రమ 12 ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేశాడు.
అయితే ఏడాది ప్రారంభమై రెండు నెలలైనా కాకముందే జైశ్వాల్ అప్పడే 500+ పరుగులతో టాప్‌లో ఉన్నాడు. ఈ లెక్కన ఈ ఏడాది క్యాలెండర్ ఆఫ్ ది ఇయర్ (1000 పరుగులు)ను జైశ్వాల్ ఈజీగా అందుకుంటాడు. మరోవైపు విలియమ్సన్, రోహిత్ శర్మ ఖాతాలో కూడా మరో 1000 పరుగుల ఏడాది చేరడం పక్కా!
-
A double century and a sensational win against England! Dedication truly pays dividends, yet it's moments like these that truly validate the effort. Immensely thankful for the support and the team spirit that paved the way to success. 🤍🙏🏼😇#TeamIndia #INDvENG #YBJ64 pic.twitter.com/LWWOV6ThXd
— Yashasvi Jaiswal (@ybj_19) February 19, 2024
గాయమని రంజీ మ్యాచ్‌కు దూరం - శ్రేయస్ ఫిట్‌గా ఉన్నాడంటున్న ఎన్‌సీఏ