2007 India Vs Pakistan Bowl Out : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్లో జట్టుకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ అందించారు. ఓ ప్లేయర్‌గా, అలాగే ఓ కెప్టెన్‌గానూ జట్టును ముందుండి నడిపించారు. అయితే సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజున ధోనీ శకం మొదలైంది. ఇక్కడే తన సారధ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి జట్టును విశ్వవిజేతగా నిలిపాటు. ఓటమి పాలవ్వాల్సిన పోరును గెలుపు బాట పట్టించాడు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే?
2007 టీ20 ప్రపంచకప్‌నకు అప్పటి సీనియర్ ప్లేయర్స్ దూరంగా ఉండటం వల్ల యంగ్ ప్లేయర్స్‌తో ఓ కొత్త టీమ్‌ను తయారు చేశారు సెలక్టర్లు. దానికి ధోనీని కెప్టెన్‌గా చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకుగానూ 141 పరుగులు స్కోర్ చేసింది. రాబిన్ ఊతప్ప (50) అర్ధ శతకంతో రాణించగా, అతడితో పాటు ధోనీ(33) జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఇక పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ ఆసిఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, షాహిద్ అఫ్రిది రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. యాసిర్ అర్ఫత్, సోహైల్ తన్వీర్ కూడా చెరో వికెట్ తీసారు.
ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన పాక్ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులే స్కోర్ చేశారు. దీంతో ఈ మ్యాచ్ కాస్త టై అయ్యింది.
ఈ నేపథ్యంలో అప్పుడు సూపర్ ఓవర్ లేనందున ఈ మ్యాచ్ ఫలితాన్ని బౌల్ ఔట్ పద్దతిలో తేల్చేందుకు ఫిక్స్ అయ్యారు. భారత స్పిన్నర్ల స్కిల్స్‌తో, ధోనీ ప్లానింగ్‌తో జట్టు విజేతగా నిలిచింది. దీంతో ఒక్కసారిగా ధోనీ పేరు క్రికెట్ చరిత్రలో మారుమోగిపోయింది. అప్పటి నుంచే ధోనీ శకం మొదలైంది. ఆ తర్వాత నుంచి మిస్టర్ కూల్ కూడా టీమ్ఇండియాకు ఎన్నో విజయాలను అందించి, పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
మిస్టర్ కూల్‌కు కోపం వస్తుందా? - ఓటమితో వాటర్ బాటిల్‌ను తన్నిన మహీ! - MS Dhoni losses his cool
ధోనీ రిటైర్మెంట్పై CSK హింట్ - ఆ ఫొటో పెట్టింది అందుకోసమేనా? - Dhoni CSK Retirement