ETV Bharat / sports

1 బంతికి 10 పరుగులు- అదీ నెం1 ర్యాంకర్ రబాడ బౌలింగ్​లో- ఎలా సాధ్యమైందంటే?

1 బంతికి 10 పరుగులు- అదీ నెం 1 ర్యాంకర్ రబాడ బౌలింగ్​లో- ఎలా సాధ్యమైందంటే?

10 Runs 1 Ball
10 Runs 1 Ball (Source: IANS)
author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

10 Runs 1 Ball : సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ రెండో టెస్టులో అరుదైన సంఘటన జరిగింది. బంగ్లాదేశ్‌ ఒక్క బంతికే 10 పరుగులు చేసేంది. అంతర్జాతీయ క్రికెట్​లో ఇలాంటివి చాలా అదురు. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మరి ఇది ఎలా సాధ్యమైందంటే?

ఓపెనర్లు షాద్‌మన్ ఇస్లాం- మహ్మదుల్ హసన్ జాయ్ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. సౌతాఫ్రికా పేసర్​ కగిసో రబాడ తొలి ఓవర్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తొలి బంతికి ఎలాంటి పరుగులు ఇవ్వలేదు. అయితే ఆ సమయంలో సౌతాఫ్రికా ప్లేయర్‌ సెనూరన్ ముత్తుసామి పిచ్‌పై పరుగెత్తాడు. దీంతో సౌతాఫ్రికా పెనాల్టీకి గురైంది. పెనాల్టీ రన్స్​ కింద అంపైర్‌ బంగ్లాదేశ్​కు ఐదు పరుగులు జోడించారు.

ఇక రబాడ రెండో బంతి నో బాల్‌ వేశాడు. బ్యాటర్ వెనకాల నుంచి వెళ్లిన ఆ బంతి కీప‌ర్‌కు కూడా అందలేదు. దీంతో ఆ బంతి నేరుగా బౌండరీని తాకింది. ఇంకేముంది! బంగ్లాదేశ్‌ ఖాతాలో మరో ఐదు పరుగులు చేరాయి. అయితే లీగల్‌గా ఒక్క బంతి మాత్రమే పూర్తయ్యింది. అటు బంగ్లా స్కోరు బోర్డు 10-0కి చేరుకుంది. దీంతో ఒక్క బంతికి బంగ్లా 10 పరుగులు సాధించినట్లైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క బంతికే 10 పరుగులు సమర్పించుకోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టెస్టు క్రికెట్‌లో ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి.

కాగా, ఈ మ్యాచ్​లో రెండో ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్లకు 38-4తో ఉంది. దీంతో బంగ్లా ప్రస్తుతం 537 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. క్రీజులో మోమినుల్ హక్ (6 పరుగులు), నజ్ముల్ హొసెన్ శాంటో (4 పరుగులు) ఉన్నారు. రబాడ 2, డేన్ పాట్రిసన్, కేశవ్ మహారాజ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రితా 575-6 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కాగా, ఈ సిరీస్​లో తొలి టెస్టులో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో నెగ్గింది.

టాప్​-10 నుంచి కోహ్లీ, పంత్ ఔట్​​ - బౌలింగ్​లో బుమ్రా డౌన్​, దూసుకెళ్లిన రబాడ

సౌతాఫ్రికా వరల్డ్​ రికార్డ్- భారత్, ఆసీస్​ను అధిగమించి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.