Hyderabad to Ayodhya Direct Train: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అయోధ్య రామమందిరంలో బాల రాముడు కొలువయ్యాడు. 500 ఏళ్ల నాటి రామ భక్తుల కల జనవరి 22న నెరవేరింది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల సమక్షంలో 51అంగుళాల ఎత్తైన రామ్ లల్లా విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం ధరించి, బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించిన బాలరాముడిని చూసి భక్తకోటి పులకరించింది. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యంతో ప్రతి ఒక్కరూ తన్మయత్వం చెందారు. ఇక సామాన్య భక్తులకు అయోధ్యలో బాలరాముడి దర్శనం నేటి(జనవరి 23) నుంచి ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో మీరు కూడా అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అయోధ్య రామయ్యకు వెల్లువెత్తిన విరాళాలు- 101 కిలోల బంగారం కానుకగా ఇచ్చిన భక్తుడు
యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్: హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతీ శుక్రవారం యశ్వంత్‌పూర్ గోరఖ్‌పూర్ రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
- రైలు నెంబర్ 15024 యశ్వంత్‌పూర్ నుంచి గోరఖ్‌పూర్ వరకు అందుబాటులో ఉంది. ఈ రైలు గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది.
- దారిలో ధర్మవరం, అనంతపురం, కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు(శుక్రవారం) ఉదయం 10.40 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది.
- శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ఈ రైలు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది.
- తెలంగాణలో కాజీపేట్ జంక్షన్, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
- తర్వాత ప్రధాన స్టేషన్లలో ఆగుతూ మరుసటి రోజు అంటే శనివారం సాయంత్రం 4.24 గంటలకు అయోధ్య ధామ్ జంక్షన్ చేరుకుంటుంది.
- ఇక అక్కడి నుంచి ఎవరి సౌకర్యార్థం బస్సులు, టాక్సీలు, ఆటోల ద్వారా అయోధ్య రామ్ మందిర్‌కు సులువుగా చేరుకోవచ్చు.
రాముడు వచ్చేశాడు! తర్వాతేంటి? అందరికీ దర్శనం ఎప్పుడు? ఏ సమయంలో వెళ్లొచ్చు?
ఇక కాచిగూడ - అయోధ్య జంక్షన్ వరకు ధర విషయానికొస్తే.. స్లీపర్‌కు రూ.680, థర్డ్ ఏసీకి రూ.1,810, సెకండ్ ఏసీకి రూ.2,625, ఫస్ట్ ఏసీకి రూ.4,470 ఛార్జీ చెల్లించాలి. ఇక ఇప్పటికే ఈ ట్రైన్ బుకింగ్స్ చూస్తే మార్చి వరకు ఫుల్ రిజర్వ్ అయ్యాయి. అంతేకాకుండా భారతీయ రైల్వే దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్స్ నడపనుంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు... ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి అయోధ్యకు నేరుగా డైరెక్ట్ ట్రైన్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి..
కోట్లాది మంది కల సాకారం- అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడు
హైదరాబాద్ నుంచి బంగారు పాదుకలు, ఛత్తీస్‌గఢ్ నుంచి 3లక్షల కిలోల బియ్యం- రాఘవుడికి ఎన్నో కానుకలు