ETV Bharat / spiritual

అపార జ్ఞాననిధి యాజ్ఞవల్క్యుడు ఎవరో తెలుసా? వ్యాసుడు, యాజ్ఞవల్క్యుడికి సంబంధం ఏమిటి? - YAJNAVALKYA MAHARSHI HISTORY

వ్యాస భగవానుని స్వరూపమైన యాజ్ఞవల్క్యుడు ఎవరు? - అపారమైన జ్ఞాన నిధిగా పేరు గాంచిన యాజ్ఞవల్క్యుని జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం

Yajnavalkya Maharshi Jayanthi
Yajnavalkya Maharshi Jayanthi (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 4:21 AM IST

Yajnavalkya Maharshi History In Telugu : తెలుగు పంచాంగం ప్రకారం నవంబర్ 11వ తేదీ కార్తిక శుద్ధ ఏకాదశి యాజ్ఞవల్క్యుని జయంతి. ఈ సందర్భంగా యాజ్ఞవల్క్యుని జీవిత విశేషాలు తెలుసుకుందాం.

ఎవరీ యాజ్ఞవల్క్యుడు?
వ్యాసుడు శ్రీ మహా విష్ణువు అంశతో జన్మించినవాడు. అటువంటి వ్యాసుడు ప్రతి ద్వాపరంలోనూ అవతరిస్తాడట. ముప్పై మూడో ద్వాపరంలో వ్యాసుడు మహా తేజస్వి అయిన యాజ్ఞవల్క్యుడిగా అవతరించినట్లుగా వైఖానస ఆగమ శాస్త్రం ద్వారా తెలుస్తోంది.

పురాణాలలో యాజ్ఞవల్క్యుని ప్రస్తావన
వేదవ్యాసుడు రచించిన మహాభారతంలోని శాంతిపర్వంలో వివరించిన ప్రకారం వైశంపాయనుడి శిష్యుడైన యాజ్ఞవల్క్యుడు గురువుతో విభేదించి సూర్యారాధన ద్వారా శుక్లయజుర్వేదాన్నీ, శతపథ బ్రాహ్మణాన్నీ దర్శించాడని తెలుస్తోంది. విష్ణుపురాణం, భాగవతం, మరికొన్ని పురాణాలలో యాజ్ఞవల్క్యుడి ప్రస్తావన కనిపిస్తోంది.

అపార జ్ఞాననిధి
యాజ్ఞవల్క్యుడు అవడానికి పేద బ్రాహ్మణుడైనా గొప్ప జ్ఞానం, నీతి నిజాయితీ, తొణకని ఆత్మస్థైర్యం కలిగినవాడు. విదేహ రాజ్యంలో జరిగిన యాజ్ఞవల్క్యుని ఆత్మస్తైర్యం, ఆత్మవిశ్వాసం గురించి వివరించే ఒక సంఘటన గురించి తెలుసుకుందాం.

జనకమహారాజు యజ్ఞం
విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. యాగానికి వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున దానధర్మాలు చేశాడు. యజ్ఞంలో పాల్గొనడానికి విచ్చేసిన పండితుల కోసం ఒక విద్వత్ సభను ఏర్పాటు చేసాడు. ఆ సభలో ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన చర్చలకు అవకాశం కలుగజేసాడు. బలిష్టమైన వేయి పాడి ఆవులని తెప్పించి, వాటి కొమ్ములను బంగారు నాణాలతో అలంకరించాడు.

సభలో జనకుని ప్రకటన
జనకుడు ఆ సభలో అందరినీ ఉద్దేశించి "బ్రహ్మజ్ఞాని అయినవాడు సభాసదులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ ఆవులను తోలుకొని వెళ్లవచ్చు" అని సభాముఖంగా ప్రకటించాడు.

పండితుల తర్జనభర్జనలు
అసలే బలిష్టమైన ఆవులు. ఇంకా వాటి కొమ్ములకు బంగారు నాణేలు కూడా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఆవులు, వాటికి బోలెడు నాణేలు. ఎంతో విలువైన పారితోషికం. అందరికీ అందుకోవాలని వుంది. అయితే తగిన అర్హత తమకుందా అని పండితులు తమలో తాము చర్చించుకోసాగారు. శాస్త్ర జ్ఞాన సంపన్నులైన ఆశ్వలుడు, ఆర్త భాగుడు, గార్గి, శాకల్యుడులాంటి వారెంతో మంది అక్కడవున్నా, ముందుకు రావడానికి సాహసించలేక పోతున్నారు.

జనకుని సవాలును స్వీకరించిన యాజ్ఞవల్క్య మహర్షి
ఎవరూ ఊహించని విధంగా యాజ్ఞవల్క్య మహర్షి మాత్రం అందుకు సిద్ధపడ్డాడు. సభలోని పండితులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. పారితోషికం చేజారిపోతున్నది. దానిని తమ వశం చేసుకోవాలంటే యాజ్ఞవల్క్య మహర్షిని ఎదిరించి, వాదించి, జయించాలి. అది వారికి సాధ్యమని అనిపించలేదు.

బ్రహ్మ తత్త్వం గురించి ప్రశ్నించిన ఆశ్వలుడు
జనకుని ప్రధాన పురోహితుడైన ఆశ్వలుడు ముందుకు వచ్చి "యాజ్ఞవల్క్యా! నీవు అందరికంటే గొప్ప వాడినని అనుకుంటున్నావా! ఎవ్వరూ ముందుకు రాకపోయినా నువ్వు ముందుకు వచ్చావు. అసలు నీకు బ్రహ్మతత్త్వం గురించి తెలుసా?'' అని అడిగాడు.

యాజ్ఞవల్క్యుని నర్మగర్భ సమాధానం
ఆశ్వలుని మాటలకు యాజ్ఞవల్క్యుడు "బ్రహ్మజ్ఞానం నాకు తెలియదు. అయినా బ్రహ్మ జ్ఞానానికి వినయంగా వంగి నమస్కరిస్తాను. నేను బీద బ్రాహ్మణుణ్ణి. ఈ ఆవుల అవసరం నాకెంతో వుంది. బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన సందేహాలు ఎవరికైనా ఉంటే నా శక్తి మేరకు వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాను" అని అంటూ బ్రహ్మ జ్ఞానం బుద్ధికి అందేది కాదని నర్మగర్భంగా సమాధానమిచ్చాడు.

యాజ్ఞవల్క్యుని పాండిత్యం
ఆ తరువాత ఆశ్వలుడు యజ్ఞాలను గురించి, వాటి అధిష్ఠాన దేవతల గురించి, యజ్ఞఫలాలను గురించి, మంత్రాలను గురించి అనేక ప్రశ్నలు వేశాడు. వాటన్నిటికీ తడుముకోకుండా యాజ్ఞవల్క్యుడు సమాధానాలు ఇవ్వడం వల్ల అశ్వలునికి మౌనంగా కూర్చోవడం తప్ప మరో మార్గం లేకపోయింది.

యాజ్ఞవల్క్యునికి జేజేలు పలికిన విద్వత్ సభ
సభలోని వారందరూ అప్రతిహతమైన యాజ్ఞవల్క్యుని బ్రహ్మ జ్ఞానానికి జేజేలు పలికారు. సభా సదులతో కలిసి జనకుడు అతనిని గో సంపదతో సాగనంపాడు.

ఇది విదేహా రాజ్యంలో జరిగిన యదార్థ సంఘటన. యాజ్ఞవల్క్యుని జయంతి రోజు ఈ కథను విన్నా చదివినా సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుని స్వరూపమైన వ్యాస మహర్షి అనుగ్రహంతో ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందుతుంది. బుద్ధి వికసిస్తుందని శాస్త్రవచనం.

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే!

ఓం నమో నారాయణాయ!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.