ETV Bharat / spiritual

హనుమంతుడు సింధూరం రంగులోనే ఉంటాడెందుకు? - ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా? - Why we apply Sindoor to Hanuman

Why we apply Sindoor to Lord Hanuman : హనుమాన్ ఆలయాలు సింధూరం రంగులో ఉంటాయి. స్వామి విగ్రహం కూడా అదే రంగులో ఉంటుంది. ఆంజనేయుడి ఆలయంలో భక్తులు నుదుట ధరించే కుంకుమ కూడా అదే! మరి.. మారుతికీ ఈ రంగుకు ఉన్న బంధమేంటి? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? దానికి సమాధానమే ఈ స్టోరీ.

Why we apply Sindoor to Lord Hanuman
Hanuman
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 10:21 AM IST

Why Lord Hanuman is Covered with Orange Colour Sindoor : హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. కొలిచిన వారికి.. తలచిన వారికి కొండంత అండగా ఉంటాడని.. అభయమిస్తాడని నమ్ముతారు. అందుకే దేవుళ్లు ఎంత మంది ఉన్నా.. వారిలో హనుమంతుడు వెరీ స్పెషల్. అయితే.. హనుమంతుడు(Hanuman)కి సింధూరం కలర్​కు ఉన్న బంధం ఏంటో మీకు తెలుసా?

జెండాపై ఎగురుతున్న కపిరాజు చాలా ఫేమస్. ఓ చేతిలో గద, మరో చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్.. ఆ కాశంలో రివ్వున ఎగిరిపోతున్నట్టుగా ఉంటుంది ఆ చిత్రం. ఆ జెండా రంగు సింధూరం. అలాగే తన ఆలయంలో ఆంజనేయస్వామి సింధూరం రంగులోనే దర్శనమిస్తాడు. హనుమాన్ కుంకుమ కూడా సింధూరమే. మరి.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా? హనుమంతునికి సింధూరాన్ని పూయడం వెనుక ఆంతర్యమేంటో.. ఇందుకు పురాణాలు ఏం చెబుతున్నాయో.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దేవాలయాలలో హనుమంతుని విగ్రహాలు ఎక్కువగా ఆరెంజ్ సింధూర్​ కలర్​లో ఉండడం వెనకు పురాణాలలో ఒక కథ ప్రచారంలో ఉంది. రామాయణం ప్రకారం.. ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో సీతాదేవి నుదిటి మీద ఎర్రటి పొడి(సింధూరం) ధరిస్తుంటుంది. అది గమనించిన ఆంజనేయస్వామి.. "అమ్మా.. ఏంటి ఆ పొడి? దాని ఎందుకు పెట్టుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటి?" అని అడుగుతాడు.

మంగళవారం ఆంజనేయుడికి ఎంతో స్పెషల్​- సింధూరంతో కొలిస్తే కోరికలన్ని నెరవేరుతాయ్!

ఈ ప్రశ్నలకు సమాధానంగా.. "హనుమా.. ఇది సింధూరం. ఇది శ్రీరాముడిని సంతోషపరుస్తుంది. సంపన్నమైన, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది." అని వాయుపుత్రుడితో సీతమ్మ చెబుతుంది. అందుకే.. తాను పాపిట సింధూరం ధరిస్తాననని చెబుతుంది. ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత హనుమంతుడు తన శరీరమంతా పూర్తిగా ఎర్రటి సింధూరం రాసుకుని తిరిగి వస్తాడు. శరీరంతో పాటు దుస్తులు, జుట్టును కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు వాయుపుత్రుడు!

సింధూరం కప్పుకున్న హనుమంతుడు.. అలాగే రాముడి వద్దకు వెళ్తాడు. అది చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. అందుకు గల కారణమేంటని ఆంజనేయస్వామిని అడుగుతాడు. అప్పుడు వాయు పుత్రుడు శ్రీరామునితో ఇలా చెబుతాడు. "సీతామాత తన నుదిటిన రోజూ సింధూరాన్ని పూయడం వల్ల మీకు(రాముడు) సంతోషం కలుగుతుందని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని చెప్పారు. ఒక్క చిటికెడు సింధూరమే మీకు సంతోషాన్నిస్తే.. నేను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే ఇంకా మరింత ఆనందం కలుగుతుంది కదా.. అందుకే రాసుకున్నాను" అని చెబుతాడు.

అప్పుడు హనుమంతుని మాటలకు సంతోషించిన రాముడు.. ఆయన భక్తులకు ఒక వరమిచ్చాడట. ఎవరైతే హనుమంతునికి పూర్తి సింధూరాన్ని పూసి పూజిస్తారో.. వారికి సంతోషకరమైన దీర్ఘాయువుతోపాటు.. కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడట. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు సింధూరంతో కళకళలాడుతుంటాయని చెబుతున్నారు పండితులు.

ఇక్కడ ఆంజనేయుడు... అడుగడుగునా దర్శనమిస్తాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.