What To Do To Live 100 Years : నిండు నూరేళ్లు ఆరోగ్యం జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ పూర్వజన్మ కర్మ ఫలితంగా కొంతమంది అకాల మృత్యువువాత పడుతుంటారు. అందుకే ఒక మనిషి తన జీవిత కాలంలో ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటివి చేయకూడదు? అనే విషయాల గురించి గరుడ పురాణంలో వివరించారు. శ్రీ మహావిష్ణువు అధిపతిగా ఉన్న గరుడ పురాణం ప్రకారం మనిషి తెలిసో, తెలియకో చేసే పొరపాట్ల వలన అల్పాయుష్కుడవుతున్నాడని, ఆ ప్రమాదం నుంచి బయట పడాలంటే ఈ 5 తప్పులు చేయరాదని వివరించారు. అవేంటంటే
ఆ పొగ హానికరం!
ఎవరైనా మరణించినప్పుడు సమీప బంధువులు అంతిమ యాత్రకు తరలి వెళ్లడం సహజం. కానీ వెళ్ళినవారు స్మశాన వాటిక నుంచి వచ్చే పొగకు దూరంగా ఉండాలని గరుడ పురాణం చెబుతోంది. ఎందుకంటే ఆ పొగలో విషపూరిత వైరస్, బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి ఆ పొగ పీల్చడం ఆరోగ్యానికి హానికరం.
అతి నిద్ర అనర్థ హేతువు
కొంతమంది బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోతూ ఉంటారు. దీర్ఘాయుష్షు కోరుకునేవారు సూర్యోదయం తర్వాత నిద్రపోరాదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచిన వారికి పరిపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. సూర్యోదయం సమయంలో గాలిలో ఎలాంటి కాలుష్యం ఉండదు. కాలుష్య రహిత గాలి మనిషిని వేయి రోగాల నుంచి కాపాడుతుందని ఇటు ఆధ్యాత్మిక గ్రంధాలతో పాటు అటు వైజ్ఞానిక శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి. కాబట్టి సూర్యోదయంతో నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటారు.
రాత్రిపూట ఈ పని చేస్తే అనారోగ్యం
గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట పెరుగు కానీ పెరుగుతో చేసిన పదార్థాలు కానీ తినరాదు. ఇదే విషయం ఆయుర్వేదం కూడా చెబుతోంది. రాత్రిపూట పెరుగు తింటే అనేక వ్యాధులు సంక్రమించి మనిషి జీవిత కాలంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. రాత్రిళ్ళు పెరుగు తినే అలవాటు ఉన్నవారు మానుకుంటే మంచి ఆరోగ్యం పొందవచ్చు.
నిద్రించే సమయంలో ఈ తప్పులు వద్దు
గరుడ పురాణం మనిషి నిద్రించే దిశ కూడా మనిషి ఆయుర్దాయాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతోంది. నిద్రించడానికి ఉత్తమమైనది దక్షిణ దిశలో తల పెట్టి పడుకోవడం. వీలు కాని సమయంలో పడమర లేదా తూర్పు తల పెట్టి నిద్రించ వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం వైపు తల పెట్టి నిద్రిస్తే మృత్యువు ఒళ్లో నిద్రించినట్లే అని గరుడ పురాణం చెబుతోంది. ఇదే విషయాన్ని వాస్తు శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు.
పాపాలు ఘోరాలకు మరణశిక్ష
చివరగా ఎవరైనా సరే చేయకూడని పనులు అంటే మహిళలను, పసిపిల్లలను, వృద్ధులను హింసించరాదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తప్పుడు మార్గంలో నడవకూడదు. దైవాన్ని నమ్ముకున్న భక్తులను బాధించరాదు. ఆహారం, నీరు అడిగినవారికి లేదని చెప్పకూడదు. సహాయం చేయగల శక్తి ఉండి కూడా అవసరంలో ఆదుకోకపోవడం పెద్ద నేరం. ఇలాంటి చెడు పనులు మానేసి మంచి మార్గంలో నడిస్తే నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని గరుడ పురాణం చెబుతోంది. శుభం భూయాత్
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శుక్రవారం ఈ పనులు అస్సలు చేయకూడదు! ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం! - Dont Do This Things On Friday
శుక్రవారం నారద జయంతి- ఈ పనులు చేస్తే తెలివితేటలు, సంగీత జ్ఞానం మీ సొంతం! - Narada Jayanti 2024