ETV Bharat / spiritual

వరలక్ష్మీ వ్రత కథ : చారుమతికి అష్టైశ్వర్యాలు ప్రసాదించిన లక్ష్మీదేవి! - ఇలా చేస్తే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తుంది - Varalaxmi Vratham Katha

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 5:19 PM IST

Varalaxmi Vrata Katha : శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ముత్తైదువులందరూ వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. కానీ.. వరలక్ష్మీ వ్రతం కథ మాత్రం చాలా మందికి తెలియదు. అందులోని చారుమతి గురించి కూడా తెలియదు. మరి.. మీకు తెలుసా? చారుమతికి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు ప్రసాదించిన విధంగానే.. మిమ్మల్ని కూడా కరుణించాలంటే.. ఈ కథ వినాల్సిందే.

Varalaxmi Vrata Katha
Varalaxmi Vrata Katha (ETV Bharat)

Varalaxmi Vrata Katha Story: సకల పురాణాలలోని కథలు సమగ్రంగా తెలిసిన ఒక మహర్షి "సూతుడు". అతడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునుల కోరిక మేరకు అనేక పురాణ కథలను వివరించేవాడని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అలా చెప్పిన కథలలో అనేక వ్రత కథలు ఉన్నాయి. అందులో ‘వరలక్ష్మీ వ్రతకథ’ కూడా ఒకటి. ఇంతకీ ఆ కథ ఏంటో మనం సవివరంగా తెలుసుకుందాం..

కథేటంటే: పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. "మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతం గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి" అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయను కీర్తిస్తున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి.. పరమేశ్వరుడ్ని ఉద్దేశించి "నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, సంతానాన్ని కలిగి ఉండేందుకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి" అని కోరింది". అందుకా త్రినేత్రుడు "దేవీ! నీవు కోరిన విధంగా మహిళలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అదే వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలి" అని శివుడు తెలిపాడు.

అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. అప్పుడు శివుడు.. "కాత్యాయనీ.. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామల సేవలో తరించేంది.

వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి అద్వితీయ ముహూర్తం ఇదే - మీకు తెలుసా?

వరలక్ష్మీ సాక్షాత్కారం: వరలక్ష్మీ వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించింది. ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని, కోర్కెలు నెరవేర్చుతానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి.." హే జననీ! నీ కృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది" అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది.

అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. చారుమతి కల గురించి విన్న పురంలోని మహిళలు వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.

ఆ రోజున ఏం చేశారు: శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది.

ఆ తర్వాత అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా.. ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు" అని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు వివరించారు.

ఇక ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని శౌనకాది మహర్షులకు సూత మహాముని చెప్పారు.

NOTE : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, పురాణాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఆగస్టు 16నే వరలక్ష్మీ వ్రతం - మొదటి నుంచి చివరి దాకా - ఎలా చేసుకోవాలో మీకు తెలుసా?

వరలక్ష్మీ వ్రతం పూజ కోసం - మహిళలు ఏ రంగు చీర కట్టుకోవాలో మీకు తెలుసా?

వరలక్ష్మీ వ్రతం రోజున ఈ బొమ్మ పూజగదిలో ఉంటే - మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.