ETV Bharat / spiritual

సొంత ఇంట్లో వక్ర దశలో శని- వాళ్లకు ఉద్యోగంలో శుభయోగాలు! మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి!! - Vakri Shani In Horoscope - VAKRI SHANI IN HOROSCOPE

What Happens When Shani Is Vakri : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిభగవానుడు ఉద్యోగ కారకుడు. ఒక వ్యక్తి కెరీర్ లో శుభయోగాలు పొందాలంటే శని భగవానుని అనుగ్రహం ఉండి తీరాల్సిందే! అలాంటి శని ప్రస్తుతం తన సొంత ఇంట్లో వక్రించి ఉండడం వల్ల కొన్ని రాశులకు శుభ యోగాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ కథనంలో శని వక్రించి ఉండడం వలన ఏ రాశులకు శుభయోగాలు ఉన్నాయో చూద్దాం.

What Happens When Shani Is Vakri
What Happens When Shani Is Vakri (ETV Bharat, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 7:50 PM IST

Vakri Shani In Horoscope : వరాహ మిహిరుడు రచించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు ఉద్యోగ స్థానానికి అధిపతి. ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు స్వస్థానమైన కుంభ రాశిలో ఉండటం, పైగా వక్రించి ఉండడం వల్ల కొన్ని రాశుల వారు ఉద్యోగం మారడానికి, కెరీర్ మార్చుకోవడానికి అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. స్వస్థానంలో శని వక్రించడం వల్ల సాధారణంగా ఉద్యోగంలో తప్పకుండా కొన్ని మార్పులు రావచ్చని పండితులు చెబుతున్నారు. శని వక్రించి ఉండడం వలన దూర ప్రాంతాల్లో వారు స్వస్థలాలకు సొంత ప్రాంతంలోని వారు దూర ప్రాంతాలకు బదిలీలు కావచ్చు. అలాగే పదోన్నతులు కూడా ఉండవచ్చు. ఏ రాశులపై ఈ ప్రభావం ఉంటుందో చూద్దాం.

ఈ రాశులకు శుభయోగం
జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్న ప్రకారం మేషం, వృషభం, సింహం, వృశ్చికం, మకర, కుంభ రాశుల వారికి నవంబర్ 15 లోగా ఉద్యోగంలో రాజయోగం పట్టే అవకాశం ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.

మేషం:
కుంభ రాశిలో శని వక్రించిన కారణంగా మేష రాశికి ఉద్యోగ కారకుడు అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో దశమాధిపతిగా ఉన్నాడు. ఈ ప్రభావం వలన ఈ రాశి వారు తప్పకుండా మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. పదోన్నతికి కోసం, భారీ వేతనం కోసం ఈ రాశివారు ఉద్యోగం మారడం జరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాలు లేదా దూర ప్రాంతం నుంచి మెరుగైన ఆఫర్ అందే సూచనలున్నాయి. చాలా కాలంగా ఒకే ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్న వారికి తప్పకుండా స్థాన చలనం ఉంటుందని ఫలితాలు చెబుతున్నాయి.

వృషభం:
కుంభ రాశిలో శని వక్రించిన కారణంగా వృషభ రాశి వారికి దశమాధిపతి అయిన శని దశమ స్థానంలోనే వక్రించి ఉన్నందువల్ల తప్పకుండా ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది. ఇతర సంస్థల నుంచి పెద్ద జీతంతో మంచి అవకాశాలను అందుకుంటారు. అలాగే దూర ప్రాంత సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు తమ సొంత ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే సూచనలున్నాయి. అలాగే ఈ రాశి వారు ఉద్యోగ భద్రత కోసం నూతన ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి.

సింహం:
కుంభ రాశిలో శని వక్రించిన కారణంగా సింహ రాశి వారికి సప్తమ స్థానంలో శని వక్రించి ఉన్నాడు. ఈ క్రమంలో సప్తమాధిపతి శని కారణంగా తప్పకుండా ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. సాధారణంగా దూర ప్రాంతానికి పదోన్నతి మీద బదిలీ కావడం జరుగుతుంది. అలాగే వ్యాపార విస్తరణ లేదా కొత్త బ్రాంచీల ఏర్పాటు వంటి కారణంగా స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు రావడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నదానికన్నా మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి.

వృశ్చికం:
కుంభ రాశిలో శని వక్రించిన కారణంగా సింహ రాశి వారికి నాలుగో స్థానంలో వక్రంగా సంచారం చేస్తున్న శని వల్ల స్థాన చలనం తప్పకపోవచ్చు. సొంత ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు దూర ప్రాంతానికి వెళ్లవలసి రావచ్చు. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు సైతం ఊహించని విధంగా గొప్ప ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. ఎక్కడ ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ప్రతిభాపాటవాలకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే హోదా పెరగడం, అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి రావడం వంటి మార్పులకు అవకాశం ఉంది.

మకరం:
కుంభ రాశిలో శని వక్రించిన ప్రభావం కారణంగా మకర రాశి వారికి ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు ధన స్థానంలో వక్రించి ఉన్నందువల్ల ఉద్యోగం మారడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం అందుకుంటున్న దానికన్నా మరింత మంచి ప్యాకేజీ కోసం ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది. పనిచేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగదలచుకున్న పక్షంలో తరచూ హోదాలు మారడం, దూర ప్రాంతం నుంచి దగ్గర ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

కుంభం:
కుంభ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ఈ రాశిలో వక్రించి దశమ స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల ఉద్యోగంలో బదిలీలకు ఎక్కువ అవకాశం ఉంది. దూర ప్రాంతానికి లేదా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. చేస్తున్న ఉద్యోగం నుంచి మెరుగైన ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశాలున్నాయి. పదోన్నతులు, భారీ వేతనాలకు అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. భారీ వేతనంతో, పెద్ద కంపెనీలో ఆఫర్ రావడం వల్ల నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.

జ్యోతిష్య శాస్త్రం గ్రహాల గమనాల ఆధారంగా గణించి కొన్ని ఊహాజనిత ఫలితాలను క్రోడీకరించి అందిస్తుంది. ఈ ఫలితాలు మానసిక బలాన్ని పెంచి, సానుకూల శక్తులను పెంచుకోడానికి మాత్రమే ఉపయోగించాలి. మానవ ప్రయత్నం లేకుండా ఏ పని సాధ్యం కాదన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.