ETV Bharat / spiritual

ఈ వారం ఆ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో ఫుల్ ప్రాఫిట్ - ప్రమోషన్ ఖాయం! - WEEKLY HOROSCOPE

ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 4:31 AM IST

Weekly Horoscope From November 17th To November 23th : 2024 నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాలలో మీ అర్హతకు సరిపడే కొత్త అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కెరీర్​లో పదోన్నతుల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో గణనీయమైన లాభాలతో పాటు పురోగతిని కూడా సాధిస్తారు. ధార్మిక మతపరమైన అంశాలలో ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో తీర్థ యాత్రలకు వెళ్తారు. సంతానంకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. హనుమాన్ చాలీసా నిత్య పారాయణ చేయడం మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా శుభ సమయం నడుస్తోంది. చేపట్టిన పనుల్లో పురోగతి, విజయం ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు రావడం వల్ల పని ఒత్తిడి పెరిగే సూచన ఉంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి అదనపు కృషి, అంకితభావం అవసరం. ఆదాయం వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారం చివరిలో ఊహించని ఆర్థిక లాభాలు రావడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. భూములు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు విజయం కోసం తీవ్రంగా కృషి చేయాలి. కుటుంబ కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఎదురైన సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగస్థులు పట్టుదల, కృషితో విజయానికి మార్గం సుగమం చేసుకుంటారు. కష్టపడే వారికి ఆటంకాలు అవరోధం కాదని నిరూపిస్తారు. పనిభారం కారణంగా మానసిక ఒత్తిడి ఏర్పడకుండా ధ్యానం చేయండి. వృత్తి నిపుణులు, వ్యాపారులు ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. విదేశీ ప్రయాణాలు చేసే సూచన ఉంది. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెట్టాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి ఊహించని బహుమతులు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది. వృత్తి పరంగా ఓ ప్రముఖ వ్యక్తి నుంచి మద్దతు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఉద్యోగస్థులకు పనిభారంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా ఉండవచ్చు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున వాహనాలను నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపారులు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంటారు. వారం మధ్యలో పనిఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్కింగ్ విమెన్ వృత్తిపరమైన బాధ్యతలను కుటుంబ జీవితాన్ని బాలన్స్ చేయడానికి కష్టపడవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు ఈ వారం ప్రారంభం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కొంతకాలంగా భూమి, ఆస్తులు కొనుగోలు చేయాలని కలలు కంటున్న వారికి ఈ వారం మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. అన్ని రంగాల వారు ఈ వారం కెరీర్​లో దూసుకెళ్తారు. ప్రమోషన్, ఆర్థిక ప్రయోజనాలతో ఆనందంగా ఉంటారు. ఉన్నత స్థాయి అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా సంపదలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు పదవీయోగం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి పరంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ నష్టం తప్పదు. పనిపట్ల చిత్తశుద్ధి, ఏకాగ్రత అవసరం. ముఖ్యమైన కెరీర్, వ్యాపార ఎంపికలలోకి తొందరపడకుండా ఉండటం ముఖ్యం. నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. వారం చివరి నాటికి ఆదాయం తగ్గి, ఖర్చులు పెరగవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. సీజనల్ వ్యాధుల బారి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టడం అవసరం. వ్యాపారస్థులు కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో సంతోషం లోపిస్తుంది. కార్యసిద్ధి హనుమాన్ ఆలయ సందర్శన శుభకరం.

.

తుల (Libra) : తులరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున వారం ప్రారంభంలో చేపట్టిన పనుల్లో గణనీయమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. వృత్తి వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కెరీర్ విజయపథంలో దూసుపోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న స్థానానికి బదిలీ పొందే అవకాశం ఉంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. వారం ప్రారంభంలో విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు ద్వారా వచ్చే లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ప్రేమికులు వివాహబంధంతో ఒక్కటవుతారు. కుటుంబ విషయాలలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన సవాళ్లు కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్థులు సహోద్యోగుల నుంచి పోటీ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. భాగస్వాములతో కలిసి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. విదేశాలలో కెరీర్లు, వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు చోటు చేసుకోవడం వల్ల కలహాలకు ఆస్కారముంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబంలో సంతోషం కోసం జీవిత భాగస్వామి భావోద్వేగాలను గౌరవించడం చాలా ముఖ్యం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఖర్చులు పెరిగే సూచన ఉంది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. పని పట్ల సోమరితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోతారు. ఇంధనం, పాలనకు సంబంధించి కొనసాగుతున్న ప్రాజెక్టులలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. వ్యాపారస్థులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చట్టపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఉండవచ్చు. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు గణనీయమైన లాభాలను అందుకుంటారు. విద్యార్థులు నూతనోత్సాహంతో చదివి ఉన్నత విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్థులు సహోద్యోగుల సహకారంతో నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభంతో సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన, స్పష్టమైన వృద్ధిని సాధిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో వ్యాపారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులు ఉన్నతాధికారుల సహకారంతో పూర్తవుతాయి. ఆర్థికంగా గడ్డుసమయం నడుస్తోంది. అయితే ఈ కష్టకాలం ఎప్పటికీ కొనసాగదని గుర్తుంచుకోండి. వారం చివరి నాటికి పరిస్థితులు మెరుగుపడతాయి. విలాస వస్తువులు కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి విజయాల పట్ల సంతృప్తితో ఉంటారు. వ్యాపారస్థులు పెట్టుబడులపై గణనీయమైన రాబడిని అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన తేలితేటలతో వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తారు. ఉద్యోగస్థులు ఆత్మవిశ్వాసంతో పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. స్థాన చలనం సూచన ఉంది. వ్యాపారులు పెట్టుబడుల నుంచి విపరీతమైన లాభాలను పొందుతారు. వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయి. సంపద పెరుగుతుంది. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ వారమంతా ఆనందం, విజయం సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.