ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి ఈ వారం ధన లాభం- ఒంటరి పక్షులకు తోడు దొరికే ఛాన్స్! - ఈ వారం రాశిఫలాలు

Weekly Horoscope From 28th January To 3rd February 2024 : ఈ 2024 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope From 28th January to 3rd February 2024
రాశి ఫలాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 4:46 AM IST

Weekly Horoscope From 28th January To 3rd February 2024 : ఈ 2024 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారి గృహ జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు కూడా కలగవచ్చు. మీరు కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తారు. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు తమ పాత ఉద్యోగాల్లోనే కొనసాగడం మంచిది. మీరు విద్యా రంగంలో బాగా రాణిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. విదేశీ వ్యాపారం చేసేవారు మంచి శుభ ఫలితాలు పొందుతారు. బ్రహ్మచారులకు వివాహయోగం ఉంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

.

వృషభం (Taurus) : వృషభ రాశివారి వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. రుణాలు త్వరగా లభించే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు అకస్మాత్తుగా ఏదో ఒక ఒప్పందం నుంచి చాలా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగం మారాలని అనుకునేవారు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేక ఇబ్బందిపడతారు. దీనివల్ల పరీక్షలో మంచి మార్కులు సాధించలేరు. క్రీడా పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తారు. చెడు సాంగత్యాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది. యోగా, ధ్యానం చేయడం మంచిది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి జీవిత భాగస్వామితో చాలా కాలంగా కొనసాగుతున్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. స్నేహితుడి కారణంగా ప్రేమ సంబంధాలలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. మీ ఇంటిని అలంకరించడానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు పై అధికారులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. విద్యార్థులు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. అనారోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. వైద్యులను సంప్రదించడం మంచిది. సోదరుల వివాహానికి వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశివారి ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మధుర క్షణాలు గడుపుతారు. కుటుంబం నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ వారం మీ అవసరాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు పరీక్ష కోసం కష్టపడి చదువుతారు. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మీ రోజువారీ పనుల్లో కీలక మార్పులు చేసుకుంటారు. మీ ఇంటికి కొత్త అతిథి వస్తారు. ఇది సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది.

.

సింహం (Leo) : సింహ రాశి ప్రేమికులు ఈ వారం సంతోషంగా గడుపుతారు. ఒంటరిగా ఉన్న వారికి కూడా మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు పెట్టుబడులు పెడితే, మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు తమకు ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త సబ్జెక్ట్ చదవాలనే కోరిక కూడా నెరవేరుతుంది. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటం కనిపిస్తుంది. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యా రంగంలో మంచి విజయం సాధిస్తారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఇది మంచి సమయం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు మీపై పడతాయి. మీ ఇంటిని బాగు చేసుకోవడానికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాగా కృషి చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. మీకు పూర్వీకుల ఆస్తి కూడా లభిస్తుంది.

.

తుల (Libra) : తుల రాశి వారు జీవిత భాగస్వామితో మధుర క్షణాలను గడుపుతారు. మీ పిల్లలతోనూ కొంత సమయం గడుపుతారు. పిల్లలతో కలిసి విహారయాత్రకు కూడా వెళ్తారు. అక్కడ వాళ్లతో కలిసి చాలా సరదాగా గడుపుతారు. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయి. ఇంటి అవసరాల కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మీకు లాభాలను అందిస్తాయి. బకాయి డబ్బులు మీకు అందుతాయి. స్నేహితుల సహకారంతో మీకు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది. మీరు విద్యా రంగంలో విజయం సాధిస్తారు. మనశ్శాంతి కోసం కొంత సమయం ఒంటరిగా గడుపుతారు. మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ప్రేమికులు తమలోని భావాలను ఎదుటి వ్యక్తికి చెబుతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. స్పెక్యులేషన్ వ్యాపారాలకు మాత్రం దూరంగా ఉండాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీనితో మీ ఆదాయం పెరుగుతుంది. కానీ పాత ఉద్యోగానికి కట్టుబడి ఉండటమే ఒక విధంగా మంచిది. విద్యార్థులు చదువుకు బదులు స్నేహితులతో ఎక్కువ సమయం గడపుతారు. దీని వల్ల తరువాత ఇబ్బంది పడతారు. ఆరోగ్యం ఫర్వాలేదు. మీ దినచర్యలో వ్యాయామం, యోగా చేర్చుకోవడం మంచిది. నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి, మంచి విజయం సాధిస్తారు.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. కుటుంబం నుంచి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేయవచ్చు. ఎలాంటి ప్రమాదకర పెట్టుబడులు పెట్టవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం హానికరం. విద్యార్థులు పరీక్షల కోసం బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ సోదర, సోదరీమణుల ఉన్నత విద్య కోసం బాగా ఖర్చు చేస్తారు. బ్రహ్మచారులకు వివాహ యోగం కలగవచ్చు. ఈ వారం మీకు ఇష్టమైన కార్యకలాపాలు చేస్తారు.

.

మకరం (Capricorn) : మకరరాశి వారు వైవాహిక జీవితాల్లో ఆనందం, శాంతిని చూస్తారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమగా గడుపుతారు. యువతీయువకులకు వివాహ యోగం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. డబ్బు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. మీ బాస్ నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు పోటీలో పాల్గొని విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తారు. ఇంటికి కొత్త అతిథి వస్తారు. ఇది సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారి ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. వివాహితులు గృహ జీవితంలో కాస్త ఇబ్బంది పడతారు. మీరు ఇంటి అలంకరణ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త ఇల్లు కొనేందుకు రుణం తీసుకోవచ్చు. మీరు భూమి వ్యవహారాల్లో మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు ఉద్యోగం మారాలనుకుంటే, ఇది మంచి సమయం. విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో చదవాలి. అప్పుడే పరీక్షలో విజయం సాధించగలుగుతారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది. మీ దినచర్యలో యోగా, ధ్యానాన్ని చేర్చుకుంటే చాలా మంచిది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు ఖర్చు చేస్తారు. స్నేహితుల ద్వారా మీకు మంచి ఆదాయ అవకాశాలు లభిస్తాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారి కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మూడవ వ్యక్తి జోక్యం వల్ల ప్రేమికుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. మీకు సులభంగా బ్యాంకు రుణాలు లభిస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. వ్యాపారం చేసే వ్యక్తులు కష్టపడి పనిచేస్తేనే విజయం లభిస్తుంది. ఉద్యోగాలు మారే వారికి ఇది సమయం మంచిది కాదు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. పోటీలో పాల్గొని గెలుస్తారు. ఉపాధ్యాయుల మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.