ETV Bharat / spiritual

విశ్వేశ్వర వ్రత మహాత్యం - ఇలా పూజలు చేస్తే సిరిసంపదలు కలగడం ఖాయం!

కార్తిక శుద్ధ చతుర్దశి మహాత్యం - ఉపవాసం, జాగారం ఉండి విశ్వేశ్వరుని భక్తితో పూజిస్తే - శత్రు భయం తొలగి - ధన, ధాన్యాలు పుష్కలంగా లభించడం ఖాయం!

Vishweshvara Vrat
Vishweshvara Vrat (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 21 hours ago

Vishweshvara Vrat 2024 : ఎన్నో పండుగలకు, విశేషమైన పూజలకు నిలయం కార్తిక మాసం. ఈ మాసంలో ప్రతి రోజూ విశేషమైనదే! ప్రతి విశిష్టమైన రోజు వెనుక ఓ పౌరాణిక గాథ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా కార్తిక శుద్ధ చతుర్దశి రోజు జరుపుకునే విశ్వేశ్వర వ్రతం గురించిన విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

విశ్వేశ్వర వ్రతం అంటే?
కార్తిక శుద్ధ చతుర్దశి రోజున శివుడు కుంఠం అనే రాక్షసుడిని సంహరించాడని పురాణ కథనం. ఈ రోజున శివుని ఆరాధన చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం.

విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు?
నవంబర్ 14వ తేదీ, గురువారం కార్తిక శుద్ధ చతుర్దశి తిథి ఉదయం 7:47 నిమిషాల నుంచి ఉంది. కాబట్టి ఇదే రోజున విశ్వేశ్వర వ్రతం ఆచరించాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.

విశ్వేశ్వర వ్రత విధానం
విశ్వేశ్వర వ్రతం ఆచరించే వారు ఈ రోజు సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేసి ఇంట్లో యథావిధిగా నిత్య పూజలు చేసుకొని శివాలయానికి వెళ్ళాలి. శివలింగానికి గంగాజలం, ఆవుపాలతో అభిషేకం జరిపించాలి. అనంతరం మారేడు దళాలు, జిల్లేడు పూలు, తుమ్మి పూలతో శివునికి అష్టోత్తర శతనామ పూజలు జరిపించాలి. శివునికి నైవేద్యంగా తేనె, ఖర్జూరం, కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు శివాలయంలో ఆవునేతితో దీపారాధన చేస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం.

సాయంకాలం పూజ
సాయంత్రం తిరిగి స్నానం చేసి శివాలయానికి వెళ్లి వెండితో కానీ, ఇత్తడితో కానీ తయారు చేసిన దీపపు కుందులలో నువ్వుల నూనె పోసి రెండు వత్తులు వేసి దీపాలు వెలిగించి, ఈ దీపాలను కుంకుమ, పూలతో అలంకరించి మంత్రపూర్వకంగా ఆలయ పూజారికి దానం ఇవ్వాలి. కార్తిక మాసంలో వచ్చే విశ్వేశ్వర వ్రతం రోజు దీపదానం చేయడం అత్యంత పుణ్యప్రదమని పురాణ వచనం.

ఉపవాసం
విశ్వేశ్వర వ్రతం ఆచరించే వారు ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు.

జాగారం
విశ్వేశ్వర వ్రతం ఆచరించే వారు ఈ రోజు రాత్రంతా శివుని భజనలు, కీర్తనలు పాడుతూ, కార్తిక పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తూ జాగారం చేయాలి. విశ్వేశ్వర వ్రతంలో ఇది ప్రధానమైన ఘట్టం. మరుసటి రోజు కార్తిక పౌర్ణమి కాబట్టి ఆ రోజు ఉదయం తిరిగి శివాలయ సందర్శన చేయాలి. దీనితో వ్రతం పరిసమాప్తి అవుతుంది.

విశ్వేశ్వర వ్రత ఫలం
విశ్వేశ్వర వ్రతాన్ని ఆచరించడం వల్ల శివుని అనుగ్రహంతో శత్రు బాధలు తొలగి, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వృద్ధి చెందుతుంది. ధనం, ధాన్యం పుష్కలంగా లభిస్తాయి. అందుకే కార్తిక శుద్ధ చతుర్దశి రోజు విశ్వేశ్వర వ్రతాన్ని ఆచరిద్దాం. ఈ వ్రతాన్ని ఆచరించలేక పోయినా చేస్తున్న వారికి సహాయం చేయడం వలన కూడా వ్రత ఫలం దక్కుతుందని పెద్దలు అంటారు.

ఓం నమ శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.