Vastu Tips for Rented House : ఇల్లు రెంట్‌కు తీసుకునే ముందు.. ఆఫీసుకు దగ్గర ఉందా? పిల్లలకు స్కూల్ దగ్గర్లో ఉందా? సౌకర్యాలన్నీ సరిగా ఉన్నాయా? అని పరిశీలిస్తారు. కానీ.. వాస్తు గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. అద్దె ఇల్లే కదా.. సొంతిల్లు కాదు కదా అనే ఆలోచనలో ఉంటారు. అయితే, రెంట్‌కు తీసుకునే ఇల్లు(House) విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాంటున్నారు వాస్తుశాస్త్ర పండితులు. లేదంటే.. ఆ ఇంట్లోని వాస్తుదోషాల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ.. అద్దెకు తీసుకునే ఇంటి విషయంలో ఎలాంటి వాస్తు నియమాలు చూడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మీరు అద్దెకు తీసుకునే ఇంటి ఈశాన్య భాగం ఓపెన్‌గా ఉండేలా చూసుకోవాలి. ఈశాన్యం భాగం ఖాళీగా ఉందని అక్కడ బరువైన వస్తువులు పెట్టకూడదట.
- మంచం, బీరువా, ట్రంక్ పెట్టె వంటివి ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో ఉండేలా వాటిని సెట్ చేసుకోవాలట. వాస్తు ప్రకారం ఈ దిశల్లో బరువైన వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లోని వారికి శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద కలుగుతుందట.
- ఇంట్లోకి సరిగ్గా వెలుతురు వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే.. వాస్తుప్రకారం ఇంట్లోకి వెలుతురు వస్తే మంచి జరుగుతుందట. ఇలాంటి ఇల్లు తీసుకోవడం వల్ల మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే సన్ లైట్ ఇంట్లోకి నేరుగా వస్తుంది.
నిర్మాణం మధ్యలో ఉన్న ఇంటిని కొనొచ్చా? - వాస్తు ఏం చెబుతోందో తెలుసా?
- కిచెన్ ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలి. వంటగది వేరే దిశలో ఉన్న హౌస్ తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.
- నిద్రించేటప్పుడు తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. అలాంటి అవకాశం లేని సందర్భంలో పడమర వైపు తల పెట్టి పడుకోవచ్చు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదంటున్నారు వాస్తు పండితులు.
- పూజ గది ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దిశలో బాత్రూమ్ ఉండకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
- ఈశాన్య దిక్కున బాత్రూమ్ ఉన్న ఇంట్లో నివసిస్తే ఆరోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల వరకు ఎన్నో ఇబ్బందులు వెంటాడుతాయని చెబుతున్నారు.
- ఇల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ శ్మశానానికి దగ్గరగా ఉండకుండా చూసుకోవాలని వాస్తు పండితులు పేర్కొంటున్నారు.
- వీధిపోట్లు, రోడ్డునుంచి పల్లంగా ఉన్న ఇళ్లు మంచివికావనే సంగతి మర్చిపోవద్దని చెబుతున్నారు.
నోట్ : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
బీరువాలో డబ్బు, నగలు ఒకేచోట పెట్టకూడదు! వాస్తు ప్రకారం ఇలా చేస్తే మీ ఆదాయం రెట్టింపు!