ETV Bharat / spiritual

వాస్తు - మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ధనలాభం! - Vastu Tips for home

Vastu Tips For Plants : మనలో చాలా మంది ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే.. ఇంటి బయట, లోపల ఇతర మొక్కలు ఎన్ని ఉన్నా సరే.. వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు తప్పక ఉండాలని వాస్తు నిపుణులంటున్నారు. ఇంతకీ ఆ మొక్కలు ఏవి ? అవి ఏ దిశలో ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం.

Vastu Tips For Plants
Vastu Tips For Plants
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 3:49 PM IST

Vastu Tips For Plants : మనలో చాలా మందికి మొక్కలంటే ఎంతో ఇష్టం. ఇంట్లో, పెరట్లో ఏమాత్రం కొంచెం స్థలం కనిపించినా కూడా మొక్కలు, పూలకుండీలతో నింపేస్తుంటారు. పర్యావరణ పరంగా మొక్కలు ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిందే. అయితే.. వాస్తు ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంట్లో తప్పకుండా ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల సంపద, శ్రేయస్సుతోపాటు.. ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని అంటున్నారు.

తులసి :
హిందూ సంస్కృతిలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారట. అలాగే ఇది ఇంట్లో డబ్బు స్థిరంగా ఉండేలా చేస్తుందట.

వెదురు మొక్క :
వాస్తు ప్రకారం వెదురు మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఆనందం, అదృష్టం, కీర్తి, ప్రశాంతత, డబ్బు కలుగుతాయని నిపుణులంటున్నారు. దీనిని ఇంట్లోగానీ ఆఫీసులో పని చేసే చోట డెస్క్‌ దగ్గర పెట్టుకోవడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ కలుగుతుందట.

స్నేక్ ప్లాంట్ :
ఇంట్లో కిటికీ పక్కన స్నేక్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఉండటం వల్ల ఇంట్లో ఆక్సిజన్‌ ప్రవాహం పెరుగుతుందట. దీనివల్ల ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నిండిపోతుందని అంటున్నారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు.

జాస్మిన్ :
వాస్తు ప్రకారం ఇంటి దక్షిణానికి ఎదురుగా ఉండే కిటికీ దగ్గరగా మల్లె మొక్కను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి బయట అయితే.. తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఈ మొక్క ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి వచ్చే సువాసనలు ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ మంచి పాజిటివ్‌ ఎనర్జీని కలిగిస్తాయని అంటున్నారు. అలాగే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుందని తెలియజేస్తున్నారు.

శాంతి లిల్లీ :
వాస్తు ప్రకారం శాంతి లిల్లీ మొక్క ప్రేమ, సామరస్యాన్ని సూచిస్తుంది. దీనిని బెడ్‌రూమ్‌లో పెట్టడం వల్ల మంచి నిద్ర కలుగుతుందట. ఇంకా చెడు కలలు రాకుండా ఉంటాయని వాస్తు నిపుణులంటున్నారు.

అరటి చెట్టు :
వాస్తు శాస్త్రం ప్రకారం అరటి చెట్టు ఎంతో విలువైనది. అందుకే దీనిని పండుగలు, శుభకార్యాలు జరిగినప్పుడు ఇంటికి ఎదురుగా పెడతారు. అయితే, ఇంట్లో ఈశాన్యం దిక్కున ఈ చెట్టును పెంచడం వల్ల మంచి జరుగుతుందని నిపుణులంటున్నారు. అలాగే ఈ చెట్టు విష్ణువు స్వరూపంగా కొలుస్తారు. ఈ చెట్టును గురువారం రోజున పూజించడం వల్ల మంచి జరుగుతుందట.

రబ్బరు మొక్క :
ఇంట్లో రబ్బరు మొక్క ఉండటం వల్ల ఆర్థిక శ్రేయస్సు, అదృష్టం, సంపద వంటివి కలుగుతాయని నిపుణులంటున్నారు. దీన్ని ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇది ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల ప్రభావాలు అన్నీ తొలగిపోతాయట.

హనుమంతుడిని మంగళవారమే ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా?

మహాశివరాత్రి నాడు - వీటిని తప్పక దానం చేయాలి - మీకు తెలుసా?

వాస్తు ప్రకారం మీ ఇంట్లో డస్ట్​బిన్​ సరైన దిశలో ఉందా? - లేదంటే ఆర్థిక కష్టాలు వస్తాయట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.