ETV Bharat / spiritual

డిప్రెషన్​తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ వాస్తు టిప్స్​తో సమస్య పరార్​! - Depression Reduce Tips

Vastu Tips for Depression : ప్రస్తుత రోజుల్లో చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య డిప్రెషన్. దీంతో చాలా మంది దీని నుంచి బయటపడేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివారు ఈ వాస్తు టిప్స్ ఫాలో అయ్యారంటే డిప్రెషన్​ను చాలా వరకు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Depression
Vastu Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 10:50 AM IST

Updated : Feb 13, 2024, 11:59 AM IST

Vastu Tips for Overcome Depression : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువ మందిని ఇబ్బందిపెడుతున్న సమస్య డిప్రెషన్. దీనికి కారణాలు అనేకం. అయితే ఒక్కసారి డిప్రెషన్​కి గురైతే మానసికంగా చిత్తు కావడం ఖాయం. ఈ క్రమంలోనే చాలా మంది ఈ ఒత్తిడిని జయించేందుకు మందులు కూడా ఉపయోగిస్తుంటారు. అయినా కొద్దిమందిలో మార్పు మాత్రం ఉండదు. అలాంటి వారి కోసం వాస్తు శాస్త్రంలో కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు వాస్తు నిపుణులు. ఆ టిప్స్​ పాటించడం వల్ల డిప్రెషన్​ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

లైట్ గ్రే కలర్- ఇది డిప్రెషన్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఈ లైట్ కలర్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ఒత్తిడికి గురైనప్పుడు లైట్ గ్రే కలర్ దుస్తులు ధరిస్తే దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా మీ లివింగ్ రూమ్ గోడలు కూడా లేత బూడిద రంగులో ఉంటే అది మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

లైట్ పింక్ కలర్ - ఈ కలర్​ను లేత గులాబీ రంగు అంటారు. ఇది చాలా సున్నితమైన రంగు. మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఈ కలర్ అత్యంత ప్రభావవంతమైనదని నిపుణులు అంటున్నారు. కాబట్టి లైట్ పింక్ కలర్ దుస్తులను ధరించడం వల్ల ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చని అంటున్నారు.

లావెండర్ : వాస్తు ప్రకారం ఈ కలర్ కూడా ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి మీరు స్ట్రెస్​కు గురైనప్పుడు లావెండర్ కలర్ దుస్తులను ధరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు వాస్తు నిపుణులు. అదే విధంగా మీ ఇంటి గోడలపై కూడా ఈ రంగు పేయింట్ వేయిస్తే ప్రశాంతత లభిస్తుంది. రిలాక్స్డ్ లుక్ కోసం ఈ కలర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

ఆఫీస్ స్ట్రెస్‌ నుంచి రిలాక్స్‌ పొందాలా? సాయంత్రం ఈ పనులు చేయండి!

వైట్ కలర్ : తెలుపు రంగు శాంతి, ప్రేమకు ప్రతీక అని అందరికీ తెలిసిన విషయమే. మెదడులోని కణాలను నియంత్రించడంలో ఈ కలర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తెలుపు రంగు మానసిక ప్రశాంతతను కలిగించడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి మీరు స్ట్రెస్​కు గురైనప్పుడు వైట్ కలర్ దుస్తులు ధరించండి. ఫలితంగా ఒత్తిడి తగ్గి మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

బ్లూ కలర్ : అన్ని రంగులలో నీలం చాలా అందమైన, అత్యంత ఆకర్షణీయమైన రంగు. దీనిని ఉపయోగించడం ద్వారా మీ జీవితం నుంచి ఒత్తిడిని శాశ్వతంగా తొలగించవచ్చు. అంతే కాదు, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి మీరు ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఈ రంగును చూస్తే అది వెంటనే మీకు రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

గ్రీన్ కలర్ : ఈ రంగు ప్రకృతికి చిహ్నం. వాస్తు ప్రకారం, ఈ రంగు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా నిరాశ, డిప్రెషన్​ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆకుపచ్చని దుస్తులు ధరించడం వల్ల చాలా వరకు డిప్రెషన్​ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా మీరు ఏదైనా ముఖ్యమైన లేదా శుభ కార్యం కోసం బయలుదేరినప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి. ఈ రంగు మీ పనులు విజయవంతం అయ్యేలా సహాయపడుతుంది.

Best Ways to Avoid Stress in Children : పిల్లల్ని ఓ కంట కనిపెడుతున్నారా..?

Last Updated : Feb 13, 2024, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.