ETV Bharat / spiritual

ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా? - వాస్తు ఏం చెబుతోందో తెలుసా? - VASTU TIPS FOR LEMON PLANT

Vastu Tips For Lemon Plant At Home : వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మచెట్టు ఉండడం అంత మంచిది కాదని కొందరు నమ్ముతుంటారు. మరి.. ఇంట్లో నిమ్మచెట్టు పెంచుకోవడం అశుభమా? వాస్తు నిపుణులు ఏమంటున్నారు??

Vastu Tips For Lemon Plant At Home
Vastu Tips For Lemon Plant At Home
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 5:19 PM IST

Vastu Tips For Lemon Plant At Home : చాలా మంది ఇంట్లో ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా కూడా.. అందులో పండ్ల చెట్లు, లేదా పూల మొక్కలు నాటుతారు. అయితే.. ఇలా ఇంట్లో వివిధ రకాల చెట్లను పెంచడం వల్ల పూలు, పండ్లు మాత్రమే కాదు స్వచ్ఛమైన గాలి, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కానీ.. ఆ చెట్లలో నిమ్మ చెట్టు ఉండకూడదని కొందరు భావిస్తుంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మచెట్టును పెంచుకోవడం మంచిది కాదని నమ్ముతుంటారు. మరి.. వాస్తు ప్రకారం నిజంగానే ఇంట్లో నిమ్మచెట్టును పెంచుకోకూడదా? నిపుణులు ఏమంటున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లో అన్ని పండ్ల చెట్లను పెంచుకున్నట్టే నిమ్మచెట్లను కూడా పెంచుకోవచ్చట. వీటిని పెంచుకోవడం వల్ల ఎటువంటి అశుభం కలగదని చెబుతున్నారు. నష్టం జరుగుతుందన్నది కేవలం అపోహే అంటున్నారు. అంతేకాదు.. ఇంట్లో నిమ్మ చెట్టును పెంచుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు.

వాస్తు ప్రకారం వంటగదికి ఏ రంగు పెయింట్ వేయాలి? మిక్సీ అక్కడ పెట్టొచ్చా? - Kitchen Vastu Tips

  • నిమ్మచెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయని.. ఇవి ఇంటి పరిసరాల్లోని గాలిని శుద్ధి చేస్తాయని చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లోని వారంతా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు.
  • ఇంట్లో నిమ్మ చెట్టును పెంచుకోవడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని.. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తకుండా ఉంటాయని.. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెబుతున్నారు.
  • వాస్తు నియమాల ప్రకారం.. ఇంట్లో నిమ్మ చెట్లు ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుందట. అలాగే ఆ ఇంట్లో సిరిసంపదలకు ఎలాంటి లోటూ కలగదని అంటున్నారు.
  • బయట నుంచి ప్రతికూల శక్తి ఇంట్లో రాకుండా కూడా నిమ్మచెట్టు అడ్డుకుంటుందని తెలియజేస్తున్నారు.
  • వాస్తు ప్రకారం నిమ్మచెట్టు ఇంట్లో ఉన్న వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుందట.
  • అలాగే నిమ్మకాయలను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.
  • వాస్తు నియమాల ప్రకారం.. ఇంట్లో నిమ్మ చెట్టు ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయని చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇంట్లో డైనింగ్‌ టేబుల్‌ సరైన దిశలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?? - Vastu Tips For home

గురువారం ఈ పూజ చేస్తే జ్ఞానం మీ సొంతం! ఆది గురవని ఎవరిని అంటారు? - pray dakshinamurthy on thursday

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.