TTD Stops the These Sevas on the Occasion of Ratha Saptami : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ స్వామి వారి సన్నిధిలో అడుగు పెట్టాలని ఎంతో మంది ఆశపడతారు. భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు. అయితే.. ఫిబ్రవరి 16వ తేదీన తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఆరోజున పలు సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఆ సేవలు రద్దు: ఫిబ్రవరి 16న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. సూర్య జయంతిని పురస్కరించుకొని ఆలయంలో ఈ వేడుకలు జరగనున్నాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా.. స్వామివారికి పలు వాహన సేవలు ఉంటాయని పేర్కొంది. ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వివరించింది. ఈ నేపథ్యంలో ఆలయంలో ఆ రోజున స్వామివారికి నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేసినట్టు పేర్కొంది. కాగా.. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు ఏకాంతంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని స్పష్టం చేసింది..
అత్యంత వైభవంగా మలయప్పస్వామివారి పుష్పయాగం - 3 రాష్ట్రాల నుంచి 11రకాలు పూలు
రథసప్తమి సేవలు ఇలా.. పవిత్ర మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజున సూర్యదేవుడు జన్మించాడని.. ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాలు చెబుతున్నాయి. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు. ఈ క్రమంలో ఆరోజున నిర్వహించే వాహన సేవలు చూస్తే..
- సూర్యప్రభ వాహనం: తెల్లవారుజామున 5.30 నుంచి ఉదయం 8 గంటల వరకు
- చిన్నశేష వాహనం: ఉదయం 9 నుంచి 10 గంటల వరకు
- గరుడ వాహనం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
- హనుమంత వాహనం: మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
- చక్రస్నానం: మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు
- కల్పవృక్ష వాహనం: సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు
- సర్వభూపాల వాహనం: సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు
- చంద్రప్రభ వాహనం: రాత్రి 8 నుంచి 9 గంటల వరకు
తిరుమలగిరుల్లొ మంచు సోయగం - కనువిందుగా దైవ దర్శనం
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా..?
శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? తిరుమల కొండపై ఈ 5 తప్పులు చేయకండి!