ETV Bharat / spiritual

భక్తులకు గుడ్​న్యూస్ : తిరుమల శ్రీవారి కానుకల వేలం - లిస్ట్​లో ఉన్న వస్తువులివే! - TTD Tender Cum Auction

author img

By ETV Bharat Features Team

Published : Aug 24, 2024, 1:40 PM IST

Tirumala Cameras Tender Cum Auction: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. భక్తులు సమర్పించిన పలు కానుకలను వేలం వేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇంతకీ, అందులో ఏయే వస్తువులు ఉన్నాయి? ఏ రోజున వేలం జరగనుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

TIRUMALA TEMPLE UPDATES
Tirumala Cameras Auction (ETV Bharat)

Tirumala Cameras And Copper Foils Auction: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఆ స్వామి రూపాన్ని కనులారా వీక్షించి ధన్యులు అవుతారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏడుకొండలవాడికి తలనీలాలు సమర్పిస్తే.. ఇంకొంతమంది భక్తులు బంగారం, వెండి, కాపర్, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు, డబ్బులు, కెమెరాలు, మొబైల్​ ఫోన్లు, వాచీలు, ఇతరత్రా వస్తువులు హుండీలో వేస్తుంటారు. అలా భక్తులు సమర్పించిన కానుకలను సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ. స్వామి వారికి భక్తులు సమర్పించిన పలు కానుకలను ఆఫ్ లైన్ ద్వారా వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంతకీ ఆ కానుకలు ఏంటి? వేలం ఏ రోజున నిర్వహిస్తారు? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లోని హుండీలలో భక్తులు వివిధ రకాల కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అలా భక్తులు సమర్పించిన వాటిల్లో కెమెరాలు, కాపర్ -2, సిల్వర్ కోటెడ్ రాగి రేకులను టెండర్ కమ్ వేలం(ఆఫ్ లైన్) వేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్న భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనవచ్చని ప్రకటించింది.

మీ ఇంట్లో కనక వర్షం కురవాలా? - వేంకటేశ్వర స్వామిని ఈ రోజున దర్శించుకుంటే చాలు!

కెమెరాల వేలం ఎప్పుడంటే: తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల హుండీల్లో భక్తులు కానుకలుగా సమర్పించిన కెమెరాలను ఆగస్టు 28వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నట్లు తెలిపింది టీటీడీ. ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 06 లాట్లు వేలంలో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రాగి రేకుల వేలం అప్పుడే: అదే విధంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ – 2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు ఆగస్టు 30, 31వ తేదీలలో టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఇందులో కాపర్ – 2 (3000కేజీలు) - 15 లాట్లు ఆగస్టు 30న, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు (2,400 కేజీలు) -12 లాట్లు ఆగస్టు 31వ తేదీ వేలానికి ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

ఆసక్తి కలిగిన వారు.. ఇతర వివరాలు తెలుసుకునేందుకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న టీటీడీ ఆఫీసులో జనరల్ మేనేజర్‌/ఏఈఓ ను సంప్రదించాలని ప్రకటనలో తెలిపింది. లేదంటే 0877-2264429 నంబర్​కు ఫోన్​ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. అదీ లేదంటే టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.orgని సంప్రదించగలరని తెలిపింది టీటీడీ. ఆసక్తి ఉన్నవారు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

భక్తులకు TTD బిగ్ అలర్ట్ - తిరుమల కొండపై నీళ్లు కొన్ని రోజులే సరిపోతాయ్! - అలా చేయాల్సిందేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.