ETV Bharat / spiritual

మహాశివరాత్రి నాడు ఇవి కొనుగోలు చేస్తే - అర్ధనారీశ్వరుడి అనుగ్రహం లభించినట్టే! - Which Things to Buy on Shivaratri

Mahashivaratri 2024: మహాశివరాత్రి నాడు ఎటు చూసినా ఓం నమః శివాయ మంత్రమే వినిపిస్తుంది. అంతగా భక్తులు ఆ శివయ్య ధ్యానంలో మునిగిపోతారు. అయితే మహాశివరాత్రి నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే ఆనందాన్ని పొందవచ్చని , సంపదను ఆకర్షించవచ్చని పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 1:12 PM IST

These Things to Buy on Maha Shivaratri 2024: మహాశివరాత్రి వచ్చేసింది. మార్చి 8వ తేదీన అన్ని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతాయి. ఎటు చూసినా ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకర మంత్రాలే వినిపిస్తాయి. అనంత భక్తకోటి శివ పూజ, ఉపవాసం, జాగరణ చేస్తూ శివయ్య ధ్యానంలో మునిగిపోతారు. అయితే మహాశివరాత్రి నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే ఆనందాన్ని పొందవచ్చని , సంపదను ఆకర్షించవచ్చని పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నంది విగ్రహం: మహా శివరాత్రి రోజున నంది విగ్రహాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. నంది శివుని భక్తుడే కాదు అతని వాహనం కూడా. కైలాసం ద్వార పాలకుడిగా కూడా నందికి ప్రాశస్త్యం ఉంది. అటువంటి మహా భక్తుడి విగ్రహాన్ని మహాశివరాత్రి రోజున ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చంటున్నారు. శివరాత్రి రోజు ఇంట్లో చిన్న వెండి నంది విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల శివానుగ్రహం లభిస్తుందని, ఆర్థిక స్థిరత్వం బలపడగా, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుందని, కష్టాలను దూరం చేస్తుందని చెబుతున్నారు.

మహాశివరాత్రి రోజు ఈ పనులు చేయకూడదు - శివుడు ఆగ్రహిస్తాడట!

పరాడ్​ శివలింగం: మహా శివరాత్రి నాడు ఎన్ని పూజలు చేసిన శివలింగానికి అభిషేకం చేయనిదే ఆ పూజకి అర్థం ఉండదు. శివుడు అభిషేకప్రియుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే శివలింగానికి అభిషేకం చేస్తే ఆయన పులకించిపోతాడు. కాబట్టి మహా శివరాత్రి రోజున పరాడ్​ శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు. అలాగే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని, ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని అంటున్నారు. అయితే సరైన విధానాలు అనుసరించి ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. క్రమం తప్పకుండా పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయి.

రాగి వస్తువులు: శివరాత్రి రోజు రాగి వస్తువులు లేదంటే కలశం కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం మంచిదని అంటున్నారు. కలశంలో గంగాజలం నింపి వాటితో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య ఆశీస్సులు పొందవచ్చని తెలుపుతున్నారు. ఇంట్లో గొడవలు, ఘర్షణ వాతావరణం ఉంటే శివరాత్రి రోజు రాగి కలశం ఇంటికి తీసుకురావడం మంచిదని.. తద్వారా సమస్యలు తొలగి పోతాయని అంటున్నారు. అంతేకాకుండా శివరాత్రి రోజు చేసే దానధర్మాలకు వెయ్యి రెట్ల పుణ్యఫలం దక్కుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే..

నెయ్యి: శివలింగానికి నెయ్యిని పూయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు.

పాలు: శివలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని పేర్కొంటున్నారు.

నల్ల నువ్వులు: మహా శివరాత్రి నాడు నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించడం వల్ల మంచిదని అంటున్నారు.

వస్త్ర దానం: పండగ నాడు పేదలకు వస్త్రాలు దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని తెలుపుతున్నారు.

మహాశివరాత్రి నాడు ఈ సంకేతాలు కనిపిస్తే - మీకు పరమేశ్వరుడి అనుగ్రహం లభించినట్టే!

మహా శివరాత్రి స్పెషల్- అర్ధనారీశ్వరుడికి అనాస కేసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.