Benefits Surya Dev Worship On Sunday : సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించేది సూర్య భగవానుడే అని శాస్త్రం చెబుతోంది. అందుకే సూర్య ఆరాధనకు వారాల్లో తొలి వారమైన ఆదివారాన్ని కేటాయించారు పెద్దలు. ఆహార ప్రదాత అయిన సూర్యునికి నమస్కరించి కృతజ్ఞతలు తెలపడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యునికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వవని శాస్త్రం చెబుతోంది. ఆదిత్యునికి నమస్కరించకుండా రోజును ప్రారంభించకూడదని కూడా పెద్దలు అంటారు.
తొలిపూజ ఆదిత్యునికి
సాధారణంగా అందరూ ఇంట్లో నిత్య పూజలు చేస్తుంటారు. తమ యోగ క్షేమాలను ఓ కంట కనిపెట్టే తమ ఇష్ట దేవతలను, కుల దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. దైవానుగ్రహంతోనే తమకి మంచి జరుగుతుందని తమ ఇష్టదేవతను అంకితభావంతో పూజిస్తూ, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కానీ ముందుగా సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి పూజ ఆరంభించాలని శాస్త్రం చెబుతోంది.
ప్రత్యక్ష నారాయణుడు
సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్ష స్వరూపమైన సూర్య భగవానుడికి భక్తితో అర్ఘ్యం ఇచ్చిన తర్వాతనే ఇష్ట దేవతారాధనకి కావలసిన అర్హత లభిస్తుందని మహర్షులు అంటారు.
సూర్య ఆరాధన ఎలా చేయాలి
ప్రతిరోజూ స్నానాదికాలు ముగించుకున్న తర్వాత ముందుగా ఓ రాగి పాత్రలో జలాన్ని తీసుకొని సూర్యునికి ఎదురుగా నిలబడి మూడు సార్లు దోసిట్లో నీళ్లు పోసుకుని అర్ఘ్యం ఇవ్వాలి. తరువాత నిత్య పూజలు మాములుగా చేసుకోవచ్చు.
ఆదివారం ఆదిత్యునికి అంకితం
ఆదివారం సూర్య ఆరాధనకు శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. ఆదివారం రోజు చేసే సూర్య ఆరాధన కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారం సూర్యోదయం సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి, సూర్యునికి ఎదురుగా నిలబడి 12 సార్లు సూర్య నమస్కారాలు చేయడం వలన దారిద్య్ర బాధలు తొలగిపోతాయని శాస్త్ర వచనం.
ఆరోగ్య ప్రదాత
ఆదివారం 12 సార్లు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయని శాస్త్రం చెబుతోంది.
పాయసం నివేదన
సూర్యునికి పాయసమంటే ఎంతో ప్రీతి. అందుకే ఆదివారం సూర్యునికి పాయసాన్ని నివేదిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు.
జిల్లేడు ఆకుల స్నానం
ఆదివారం స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులను శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేస్తే ఎంతో కాలంగా వేధిస్తున్న తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆదివారం వీటికి దూరంగా ఉండాలి
ఆదివారం సూర్య ఆరాధన చేసే వారు నియమ నిష్ఠలతో ఉండడం తప్పనిసరి. ఈ రోజు మద్య మాంసాలు స్వీకరించరాదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఆరోగ్య ప్రదాత ఆహార ప్రదాత ఆయన సూర్య భగవానుని నియమనిష్టలతో పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్షు వృద్ధి చెందుతాయని శాస్త్ర వచనం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మ్యారేజ్ లేట్ అవుతుందా? శుక్రవారం ఈ పూజ చేస్తే చాలు అంతా చకచకా! - Puja For Marriage