Subramanya Swamy Pooja Vidhanam Telugu : జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కుజ, రాహు గ్రహాలను పాప గ్రహాలుగా పేర్కొంటారు! ఒక వ్యక్తి జాతకంలో ఈ గ్రహ దోషాలున్నా లేక కర్మఫలితాలు విపరీతంగా ఉన్నా కుజునికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యుని ఆరాధన ద్వారా ఈ దోషాలు పోగొట్టుకోవచ్చునని శాస్త్ర వచనం. ఒక్కొక్కసారి మనకు కొన్ని రకాల బాధలు ఎందుకు కలుగుతున్నాయి కూడా అర్ధం కాదు. ఇలాంటివన్నీ మన పూర్వజన్మల కర్మ ఫలితంగానే అనుభవించాల్సి వస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే ఇలాంటి దోషాల నుంచి తప్పక విముక్తి పొందవచ్చు.
సుబ్రహ్మణ్యుని ఎలా ఆరాధించాలి?
Subramanya Swamy Pooja Benefits : పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు నియమనిష్టలతో ఆరాధిస్తే కుజ దోషాలు పోతాయి. ముఖ్యంగా కుజుడు వివాహం, సంతాన కారకుడు. కాబట్టి వివాహం ఆలస్యమయ్యే వారు, సంతానం కోసం ఎదురు చూసే వారు సుబ్రహ్మణుని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది, చక్కని సంతానం కలుగుతుంది.
సుబ్రహ్మణ్యునికి క్షీరాభిషేకం జరిపిస్తే!
మనకు ప్రతి శివాలయంలో సుబ్రహ్మణ్యుని స్థానం తప్పనిసరిగా ఉంటుంది. ముందుగా మన సంకల్పం స్వామికి చెప్పుకుని ఎవరు వివాహం లేదా సంతానాన్ని కోరుకుంటున్నారో వారి పేరు, జన్మ నక్షత్రం మీద మంగళవారం నాడు సుబ్రహ్మణ్యునికి క్షీరాభిషేకం జరిపిస్తే మంచిది. కుజ గ్రహానికి ఎరుపు రంగు సంకేతం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు వస్త్రం, ఎర్రని పూలు, ఎర్ర చందనం, దానిమ్మ పండు వంటివి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.
ఆరోజు కల్యాణం జరిపించుకుంటే!
ఇలా తొమ్మిది మంగళ వారాలు జరిపించిన అనంతరం ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం (దీనినే ఆడికృత్తిక అని కూడా అంటారు) రోజున కానీ, మార్గశిర శుద్ధ ష్షష్ఠి రోజున శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం జరిపించుకుంటే సకల దోషాలు పోయి అనుకున్న పనులు నెరవేరుతాయి.
రావి చెట్టు కింద ఉన్నట్లయితే!
అలాగే సమీపంలో ఉన్న ఏ దేవాలయంలోనైనా నాగ ప్రతిష్ఠ ఉంటే ముఖ్యంగా అవి కనుక రావి చెట్టు కింద ఉన్నట్లయితే ఇక్కడ కూడా ప్రతి మంగళవారం క్షీరాభిషేకం చేస్తే సుబ్రహ్మణ్యుని పూజించిన ఫలితమే వస్తుంది. సుబ్రహ్మణ్యుని విభూతి ధరించడం వలన సకల గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి. ప్రతి మంగళవారం ఈ విధంగా సుబ్రహ్మణ్యుని ఆరాధిద్దాం. గ్రహశాంతి చేసుకుందాం మనఃశాంతిని పొందుదాం!
శనిదేవుడికి బెల్లం నైవేద్యం- ఆంజనేయుడికి ఆకుపూజ- శనివారం ఇవి చేస్తే మీ సమస్యలన్నీ క్లియర్!
ప్రతి ఆదివారం సూర్యుడికి ఇలా పూజ చేస్తే ఎంతో మంచిది- గోధుమలు దానం చేస్తే!