Main Door Vastu Tips : ఇంటి ప్రధాన ద్వారం విషయంలో తప్పకుండా వాస్తు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి.. ఇంట్లోని మెయిన్ డోర్ విషయంలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
దక్షిణ దిశలో :
ఒకవేళ మీరు కొత్తగా ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే.. మెయిన్ డోర్ దక్షిణ దిక్కులో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిశ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా దక్షిణ దిక్కులో ప్రధాన ద్వారం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవీ ఎల్లప్పుడూ ఉంటుందట.
సైజ్ పెద్దగా ఉండాలి :
మనం ఇంట్లో ఉన్న రూమ్‌ల ఆధారంగా తలుపులు ఎక్కువగానే ఉంటాయి. అయితే.. ఇలా ఇంట్లో తలుపులు ఎన్ని ఉన్నా సరే ఇంటి ప్రధాన ద్వారం తలుపు మాత్రం మిగతా అన్నింటికన్నా పెద్దగా ఉండాలని నిపుణులంటున్నారు. దీనివల్ల ఇళ్లంతా పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయని చెబుతున్నారు.
శుభ్రంగా ఉండాలి :
ఎవరైనా మనం ఇంట్లోకి వచ్చే ముందు మెయిన్ డోర్‌ను కచ్చితంగా చూస్తారు. కాబట్టి, అది తళతళ మెరిసేలా ఉండాలి. మెయిన్ డోర్‌పై ఎప్పుడూ జిడ్డు, మరకలు ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే తలుపులను బిగించిన కొన్ని రోజుల తర్వాత వాటిని మూసేటప్పుడు, తెరిచేటప్పుడు కీచుమని శబ్దాలు వస్తాయి. వాస్తు ప్రకారం ప్రధాన ద్వారాలు శబ్దం రాకుండా ఉండటం మంచిదని తెలియజేస్తున్నారు. కాబట్టి, తలుపులను ఎప్పటికప్పుడు టైట్‌గా ఫిట్ చేసుకోవాలి.
ఎండిన మొక్కలు వద్దు :
కొంత మంది ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పూల మెుక్కలు, చిన్న చెట్ల కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ, కొన్ని రోజుల తర్వాత అవి ఎండిపోతాయి. అయితే, ఇలాంటి వాటిని కొంతమంది మార్చే ప్రయత్నం చేయకుండా ఉంటారు. మెయిన్ డోర్‌కు ఎదురుగా ఎండిన మొక్కలు అస్సలు ఉండకూడదట. అవి ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. వాస్తు ప్రకారం మెయిన్ డోర్ ఎదురుగా డస్ట్‌బిన్స్, విరిగిన బల్లలు లేదా కుర్చీల వంటి వస్తువులు ఉండకూడదని అంటున్నారు.
వెల్‌కమ్ డోర్ మ్యాట్‌లు ఏర్పాటు చేయండి :
మెయిన్ డోర్ ఎంట్రెన్స్ వద్ద కింద ఖాళీగా ఉంచకుండా, మార్కెట్లో దొరికే మంచి డోర్ మ్యాట్‌లను పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. వాటిపై వెల్‌కమ్ అని రాసి ఉంటే ఇంకా మంచిదని, ఇది ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగజేస్తుందని అంటున్నారు.
అలాంటి తలుపులు వద్దు :
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చెక్కతో చేసినది అయి ఉండాలి. కొంత మంది మార్కెట్లో దొరికే ప్లైవుడ్ వంటి వాటిని ఏర్పాటు చేయాలని అనుకుంటారు. కానీ, ఇలా చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం మెయిన్ డోర్ తలుపులపైన స్వస్తిక్ గుర్తులు, గణపతి విగ్రహాలు ఉండటం చాలా మంచిదని అంటున్నారు. ఇలా ఉండటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుందని తెలియజేస్తున్నారు.
ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టాలో తెలుసా? ఆ దిక్కున పెడితే మీకు అన్ని శుభాలే!