Lord Vinayaka Powerful Mantras : విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. హిందూ సంప్రదాయంలో మొదటి పూజ ఆయనకే. జ్ఞానం ప్రసాదించడంలో, గొప్ప విజయాలను అందించడంలో ఆది దేవుడు ఆ గణనాథుడు. మనస్ఫూర్తిగా వినాయకుడిని పూజిస్తే అదృష్టం వరిస్తుందని, ధనలాభం సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. లంబోదరుడిని ఎలా పూజించినా తృప్తి చెందుతాడు.
స్వచ్ఛమైన మనస్సు, ఆరాధించే సమయంలో శ్రద్ధతో పూజిస్తే చాలు.. కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. మరి అలాంటి ఏకదంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. ఆయన ఆశీస్సులు, అనుగ్రహం పొందడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వాటిని పఠించడం వల్ల జీవితంలో అదృష్టం వరిస్తుంది. ధనలాభం చేకూరుతుంది. తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. మరి ఇంతకీ ఆ మంత్రాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
- "ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా".. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. పనులు విజయమంతమవుతాయి. జ్ఞానం, సంపద, అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయట.
- "ఓం గం గణపతియే నమః".. ఈ గణేశ మంత్రం చాలా శక్తివంతమైనదని విశ్వాసం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని ప్రతికూలతలు తొలగిపోతాయని, వ్యాపారంలో విజయం సాధిస్తారని. ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపిస్తే పని విజయవంతం అవుతుందని సూచిస్తున్నారు.
- "ఓం ఏకదంతాయ విద్మహే, వక్రతుండా ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్".. ఈ మంత్రాన్ని పఠించే వారు జ్ఞానం పొందుతారు. మంచి తెలివితేటలు సొంతం అవుతాయని చెబుతున్నారు.
మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని సరైన దిశలోనే ఉంచారా? - లేదంటే ఎన్ని పూజలు చేసిన శూన్యం!
- "ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్య కర్త్రే సమస్త విఘ్న ప్రశమ్నయ్, సర్వార్జయ్ వశ్యాకరాణాయ్ సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా".. శ్రేయస్సు, సంపదతో జీవించేలా చూడమని వినాయకుడిని ప్రార్థించడానికి ఈ మంత్రాన్ని పఠిస్తారు. ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే మానసిక ప్రశాంతత, తలపెట్టిన పనుల్లో విజయం లభించి.. ఆర్థిక లాభం చేకూరుతుందట.
- "ఓం గణేష్ రిన్నమ్ ఛింది వరేణ్యం హూం నమః ఫుట్".. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో సంపద, సంతోషం లభిస్తాయి.
- "ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వ జనమ్మే వశమానాయ స్వాహ".. ఈ మంత్రం జపించడం వల్ల జీవితంలో శాంతి, అదృష్టం, విజయం దక్కుతాయట.
- "ఓం విఘ్ననాశాయ నమః".. జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని, ఎటువంటి లోటూ లేకుండా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ప్రయోజనం చేకూరుతుందట.
- "ఓం గజకర్ణకాయ నమః".. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుంది. అలాగే ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడుతుందట.