ETV Bharat / spiritual

విష్ణుమూర్తే కాదు, శివుడు కూడా 10 అవతారాలు ఎత్తారు- వాటి గురించి తెలుసా? - Shiva Avatars Names

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 5:06 AM IST

Lord Shiva Avatars List : శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి, ఆ అవతారాల ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే! అయితే పరమశివుడు కూడా దశావతారాలు స్వీకరించిన విషయం తెలుసా! వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న ఈ విషయం ముమ్మాటికీ నిజం. పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి.

Shiva Avatars Names
Shiva Avatars Names (ETV Bharat)

Lord Shiva Avatars List : లోకంలో ధర్మ సంస్థాపన కోసం, రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించిన విషయం మనందరికీ తెలిసిందే! అయితే పరమశివుడు కూడా కొన్ని సందర్భాలలో వివిధ అవతారాలను స్వీకరించాడు. ఆయన ప్రతి అవతారంలో అమ్మవారు కూడా ఒక్కో పేరుతో అవతరించింది. శివ మహా పురాణం లోని 17 వ అధ్యాయంలో ఈ శివుని దశావతారాల గురించిన ప్రస్తావన ఉంది.

  • మొదటి అవతారం- దశావతారాల్లో శివుని మొదటి అవతారం మహాకాలావతారం. ఈ అవతారంలో అమ్మవారు మహాకాళిగా శివుని అర్ధాంగిగా అవతరించి, తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తుంది.
  • రెండో అవతారం- శివుని రెండో అవతారం తార్! ఈ అవతారంలో శక్తి తార పేరుతో అవతరించి స్వామిని అనుసరిస్తుంది. శివ శక్తులు తార్ అవతారంలో తమ భక్తులకు భుక్తి ముక్తి ప్రసాదిస్తారు.
  • మూడో అవతారం- పరమశివుని మూడవ అవతారం బాలభువనేశుడు. ఈ అవతారంలో అమ్మవారు బాలభువనేశ్వరిగా శివుని ఇల్లాలుగా ఆయనను అనుసరించి భక్తులకు సుఖాలను ప్రసాదిస్తుంది.
  • నాలుగో అవతారం- శివుని నాలుగో అవతారం శ్రీషోడషశ్రీవిద్యేశుడు. ఈ అవతారంలో అమ్మవారు శ్రీషోడషశ్రీవిద్యాదేవిగా పరమశివుని ఇల్లాలుగా ఆయనను అనుసరించి భక్తులకు జ్ఞానం, సుఖసౌఖ్యాలను అనుగ్రహిస్తుంది.
  • ఐదో అవతారం- పరమశివుని ఐదో అవతారం భైరవుడు. ఈ అవతారంలో అమ్మవారు భైరవిగా శివుని ఇల్లాలుగా అవతరించి తన ఉపాసకులు, భక్తులను సర్వ కాలాల్లో సదా రక్షిస్తూ ఉంటుంది.
  • ఆరో అవతారం- శివుని ఆరో అవతారం చినమస్తకుడు. ఈ అవతారంలో అమ్మవారు చినమస్తకిగా అవతరించి తనను ఆశ్రయించిన భక్తుల పాపాలను హరిస్తుంది.
  • ఏడో అవతారం- పరమశివుని ఏడో అవతారం ధూమవంతుడు. ఈ అవతారంలో అమ్మవారు ధూమావతి పేరుతో శివుని ఇల్లాలుగా అవతరిస్తుంది. ఈ సమయంలో ఆదిదంపతులు ధూమవంతుడు, ధూమావతిగా తమను కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతారు.
  • ఎనిమిదో అవతారం- శివుని ఎనిమిదో అవతారం బగలాముఖుడు. ఈ అవతారంలో పార్వతీదేవి బగలాముఖిగా వెలసి భక్తుల ఈతిబాధలను పోగొడుతుంది.
  • తొమ్మిదో అవతారం- శివుని తొమ్మిదో అవతారం మాతంగుడు. ఈ అవతారంలో అమ్మవారు మాతంగి పేరుతో శివుని ఇల్లాలుగా అవతరించి భక్తులకు సిరిసంపదలు అనుగ్రహిస్తుంది.
  • దశావతారం- శివుని దశావతారం కమలుడు. ఈ అవతారంలో అమ్మవారు కమల పేరుతో శివుని ఇల్లాలుగా అవతరించి భక్తులకు భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది.

ఈ అవతార విశేషాలన్నీ ఎక్కువగా తంత్ర శాస్త్రాలలో కనిపిస్తాయి. తంత్ర శాస్త్రాలలో కనిపించే పార్వతి దశావతారాలు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంటాయి. ఈ అవతారాలు కొలవడానికి ప్రత్యేకించి ఉపాసన మార్గాలు ఉన్నాయి. అవన్నీ గురుముఖతా చేయవల్సిన విధివిధానాలు. కష్టతరమైన ఉపాసన మార్గాలు అనుసరించలేకపోయినా ఆదిదంపతుల దశావతారాలను ప్రతిరోజు ఉదయం స్మరించుకుంటే శివశక్తుల అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని శివ పురాణంలో వివరించారు. అంతేకాదు ఈ అవతార విశేషాలను చదివినా, విన్నా విశేష సుఖాలు లభిస్తాయని శాస్త్రవచనం. ఓం నమః శివాయ! శ్రీ మాత్రే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.