ETV Bharat / spiritual

"15న కార్తిక పౌర్ణమి పర్వదినం - ఆ రోజున తప్పక చేయాల్సిన పూజలు ఇవే!" - KARTIKA PURNIMA 2024 IN TELUGU

- ఇలా చేస్తే శివుడి సంపూర్ణ అనుగ్రహం మీపైనే

Kartika Purnima
Kartika Purnima 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 1:38 PM IST

Kartika Purnima 2024 : హిందువులకు కార్తిక మాసం ఎంతో ప్రీతికరమైనది. ఇక, కార్తిక పౌర్ణమి పర్వదినం మరింత ముఖ్యమైనది. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలో కార్తిక పౌర్ణమి పర్వదినం వస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తిక పౌర్ణమి రోజున కొన్ని విధివిధానాలు పాటించాలని, దానివల్ల కష్టాలు, గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్​కుమార్' చెబుతున్నారు.

  • కార్తిక పౌర్ణమి నాడు ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలి. ఇలా చేస్తే దృష్టిదోషం, నరపీడా వంటి సమస్యలను నుంచి తప్పించుకోవచ్చు.
  • కార్తిక పౌర్ణమిన రోజు దీప దానం కూడా చేయాలి.
  • ఇంకా ఈ రోజు దేవాలయ ప్రాంగణంలో గానీ లేదా ఇంట్లో.. 365 వత్తులతో లేదా 720 వత్తులతో దీపం వెలిగించాలి.
  • ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందట.
  • ఈ రోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తిక పౌర్ణమి రోజునే. ఈ విషయం చాలా మందికి తెలియదు.
  • ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తిక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంధ పురాణం వైష్ణవ ఖండంలో పేర్కొన్నారు. ఇందుకోసం.. ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రహ్మణుడికి ఉసిరికాయ దానం ఇవ్వాలి.
  • అందరూ కార్తిక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుంది.

గృహ యోగం కలగాలంటే..

తొందరగా గృహ యోగం కలగాలంటే కార్తిక పౌర్ణమి నాడు మహిళలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఇలా చేస్తే గృహ యోగం కలుగుతుంది.

జ్వాలా తోరణోత్సవం..

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవం నేత్రానందంగా నిర్వహిస్తారు. దీనిని తప్పకుండా చూడాలి. జ్వాలా తోరణోత్సవం వీక్షిస్తే నరపీడ, దృష్టి దోషం, శత్రు బాధలు తొలగిపోతాయి. జ్వాలా తోరణోత్సవం పూర్తైన తర్వాత అక్కడి బూడిద నుదుటన రాసుకోవాలి.

అమ్మాయిలకు మంచి భర్త రావాలంటే..

పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కార్తిక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచాలి. అక్కడ రాధాకృష్ణుల ఫొటో పెట్టాలి. ఫొటో దగ్గర దీపం వెలిగించి రకరకాల పుష్పాలు, తీయని నైవేద్యాలను ఉంచాలి. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఇలా చేయడం వల్ల మంచి వ్యక్తితో వివాహం జరుగుతుందని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

"రేపే శ్రీ మహా విష్ణువు మేల్కొనే ఉత్థాన ఏకాదశి - శ్రీహరి భక్తులు ఇలా చేయాలి"

కార్తిక సోమవారం వీటిల్లో ఏ ఒక్క పని చేసినా - శివుడి అనుగ్రహం తప్పకుండా పొందుతారట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.