ETV Bharat / spiritual

కార్తీక మాసంలో ఈ పూజ చేస్తే చాలు - అశ్వమేధ యాగం చేసినంత ఫలం!

హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో చేయాల్సిన పూజలు ఇవే!

Hariharulu
Harihara (ETVM Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Karthika Masam Rituals : తెలుగు పంచాంగం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవ మాసం. శరదృతువులో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. ఈ మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే! మరో రెండు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కానున్న సందర్భంగా కార్తీక మాస విశిష్టతను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

కార్తీకమాస మహత్యం
శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసంలో ఏ ఇంట చూసినా శివనామ స్మరణమే! ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే! వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం, కార్తీకమాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శివ శివ అంటూ నామస్మరణ చేసినా, కార్తీక దామోదర అంటూ కీర్తించినా శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివ నామస్మరణ, పూజ అత్యంత ఫలవంతం. సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారు అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం.

ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు
ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే.

కార్తీక మాసంలో ఆచరించాల్సిన విధులు
కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతోపాటు, స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి , నర్మద, తపతి, సింధు మొదలైన నదులన్నింటి నీరు ఉందని భావించాలి.

కౌముది మాసం
జ్యోతిషశాస్త్రం ప్రకారం కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దానిని కార్తీక మాసంగా పిలుస్తారు. నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీకమాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు.

ఈ తిథులు ప్రత్యేకం!
కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి, సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుంది. అదే విధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాసశివరాత్రినాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడూ రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.

కనీసం ఒక్కరోజైనా!
కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ తిథులలో కానీ, ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే చాలు - పూర్తి పుణ్యఫలం లభిస్తుంది.

కార్తీక పౌర్ణమి
కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి, అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉప కథలు చెబుతున్నాయి.

క్షీరాబ్ది ద్వాదశి వ్రతం
కార్తీక శుద్ధ ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి పేరిట తులసి చెట్టు, ఉసిరిక చెట్టుని లక్ష్మీ నారాయణులుగా భావించి కల్యాణం చేస్తారు.

కార్తీక పురాణ విశిష్టత
కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం విన్నా, చదివినా అత్యంత పుణ్యం.

వన భోజనాలు
కార్తీకమాసంలో విశేషంగా ఆచరించే వన భోజనాల సంప్రదాయం ఈనాటిది కాదు. ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్రవచనం.

ఇవి నిషిద్ధం
పరమ పవిత్రమైన కార్తీకమాసంలో తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. ఈ నియమాలు పాటిస్తూ పవిత్ర కార్తీక మాసంలో శివకేశవులను పూజిద్దాం. శివసాయుజ్యాన్ని, వైకుంఠ ప్రాప్తిని పొందుదాం.

ఓం నమః శివాయ! ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.