ETV Bharat / spiritual

బుధవారమే కామిక ఏకాదశి- ఈ పూజ చేస్తే ఎంతో పుణ్యం! ఎలా ఆరాధించాలో తెలుసా? - Kamika Ekadashi 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 5:20 PM IST

Kamika Ekadashi 2024 : తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఆషాడమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేషాం కామిక ఏకాదశి అని అంటారు. జులై 31వ తేదీ బుధవారం కామిక ఏకాదశి రానున్న సందర్భంగా ఆ రోజు ఏ దేవుని పూజించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? వంటి ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

kamika ekadashi 2024
kamika ekadashi 2024 (Getty Images)

Kamika Ekadashi 2024 : ఆషాఢ మాసం కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకొంటారు. మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఈ ఏకాదశికి ఉందని భక్తుల విశ్వాసం. ఆషాడం శుక్ల పక్షంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కావడం వల్ల దీనిని విశేషంగా భావిస్తారు. ఈ కామిక ఏకాదశి గురించి ప్రస్తావన నారద పురాణం, బ్రహ్మ పురాణంలో ఉంది.

కామిక ఏకాదశి రోజున ఎవరిని పూజించాలి?
శంఖ, చక్ర గదాధరుడు అయిన శ్రీ మహా విష్ణువును ఈ రోజు లక్ష్మీదేవి సమేతంగా పూజించాలి. 'కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాల్లో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్నీ దానం చేసిన దానికన్నా, గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం, గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం ఎన్నో రెట్లు ఎక్కువ' అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

కామిక ఏకాదశి పూజ సమయం
తెలుగు పంచాంగం ప్రకారం కామిక ఏకాదశి జులై 30వ తేదీ సాయంత్రం 4:45 నిమిషాలకు ప్రారంభమై 31వ తేదీ మధ్యాహ్నం 3:56 నిమిషాల వరకు ఉంది. మన సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజు ఏకాదశి వ్రతం చేసుకోవాలి కాబట్టి జులై 31వ తేదీనే కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.

పూజా విధానం
కామిక ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పూజా మందిరం శుభ్రం చేసుకొవాలి. లక్ష్మీనారాయణుల మూర్తులను ప్రతిష్టించుకొని ఆవు నేతితో దీపారాధన చేసి తులసి దళాలు సమర్పించాలి. శ్రీలక్ష్మి అష్టోత్తర శత నామాలు, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తికి ఈ రోజు వెన్న నైవేద్యంగా సమర్పించి అనంతరం దానిని ప్రసాదంగా అందరికీ పంచి పెట్టాలి. కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ, గ్రాసముతో కలిపి దానం చేయడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు.

సాయం సంధ్యా పూజ
సాయంత్రం తిరిగి స్నానం చేసి తులసి కోట వద్ద దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. వీలైతే సమీపంలోని వైష్ణవ ఆలయాన్ని సందర్శించి శ్రీమన్నారాయణుని దర్శించాలి. రాత్రంతా భాగవత కథలతో, భగవన్నామ సంకీర్తనలతో కాలక్షేపం చేస్తూ జాగారం చేయాలి. కామిక ఏకాదశి వ్రత మహాత్యాన్ని తెలిపే కథను చదువుకోవాలి.

ద్వాదశి పారణ
మరుసటి రోజు ఉదయం స్నానాదికాలు పూర్తి చేసుకొని నిత్య పూజాదికాలు చేసి ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాసాన్ని విరమించాలి. రానున్న కామిక ఏకాదశి వ్రతాన్ని మనమందరం కూడా ఆచరిద్దాం. మోక్షాన్ని పొందుదాం.

జై శ్రీమన్నారాయణ!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

విష్ణుమూర్తికే తప్పని శాపాలు- పతివ్రత కోపంతో రాయిగా మారిపోయాడంట! - Sri Vishnu And Vrinda Story

సంతానం కోరుకునే వారు ఇలా చేస్తే శుభఫలితం! సోమవారమే సకల గ్రహ దోషాలు పోగొట్టే ఆడికృత్తిక- చేసేయండి మరి - Aadi Krithigai 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.