ETV Bharat / spiritual

మీ మెయిన్ డోర్​కు ఎదురుగా లిఫ్ట్ ఉందా? - వాస్తు ప్రకారం జరిగేది ఇదే! - Vastu Tips for Home in Telugu

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 11:03 AM IST

Vastu Tips for Home in Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తును చాలా మంది బలంగా విశ్వసిస్తారు. ఇంటి నిర్మాణం మొదలు ఇంట్లోని వస్తువుల ఏర్పాటు వరకు ప్రతిదీ వాస్తు ప్రకారమే చేస్తారు. అయితే, వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఈ దిక్కులో పెట్టడం వల్ల అదృష్టం కలసివస్తుందని చెబుతున్నారు పండితులు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Vastu Tips for Home in Telug
Vastu Tips for Home in Telugu (ETV Bharat)

Vastu Tips for Home in Telugu: చాలా మంది వాస్తు ప్రకారం ఇంటిని కట్టుకుంటారు. అయితే, ఇంటి నిర్మాణం సరిగ్గా చేసినా ఇంట్లోని వస్తువులను మాత్రం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. కానీ, ఇంట్లోని వస్తువులు పెట్టే విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు వాస్తు పండితులు. ఈ నేపథ్యంలోనే వాస్తు ప్రకారం ఏ వస్తువులు ఏ దిక్కులో ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ప్రముఖ వాస్తు పండితుడు మాచిరాజ్ కిరణ్ కుమార్ వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • టీవీలు, కంప్యూటర్లు.. ఇంట్లోని స్టడీ, లివింగ్ రూమ్​లో ఆగ్నేయ మూలలో ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే, ఈశాన్యం, నైరుతి దిక్కులో మాత్రం ఇవి ఉండకూడదని చెబుతున్నారు.
  • కొంతమంది తెలియక వంటగదిలో అద్దాలు పెట్టుకుంటారు. అయితే, వంట గదిలో ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. పడక, స్నానాల గదిలో అద్దాలు బిగించేటప్పుడు తూర్పు లేదా ఉత్తర గోడకు అద్దాలని బిగించుకోవాలని సూచించారు. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు అదృష్టం కలిసి వస్తుందంటున్నారు.
  • అపార్ట్​మెంట్, ఇండిపెండెంట్ హోమ్ ఇలా ఎలాంటి ఇంట్లో ఉంటున్నా సరే.. మెయిన్ ఎంట్రన్స్​కు ఎదురుగా లిఫ్ట్​ ఉండకూడదని.. ఇలా ఉండడం వల్ల అదృష్టం కలిసిరాదని చెబుతున్నారు.
  • బెడ్​రూమ్​లోకి గాలి నైరుతి వైపు నుంచి వచ్చేలా చూసుకోవాలని తెలుపుతున్నారు. నైరుతి నుంచి గాలి వీస్తుంటే ఎలాంటి వాస్తు దోషం ఉండదని వివరిస్తున్నారు. కిటికీలు దక్షిణ, పడమర మూలల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • వ్యాపార ప్రదేశం, ఆఫీస్​లో పనిచేసుకునేటప్పుడు మనకు కుడివైపు కంప్యూటర్ ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీతో పాటు అదృష్టం కలిసివస్తుందని తెలుపుతున్నారు.
  • కొంతమంది బెడ్​రూమ్​లో పూలు పెడుతుంటారు. అయితే ఇలా ఉండడం మంచిది కాదని.. కాకపోతే పండ్లు పెట్టుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా దానిమ్మ పండు పెయింటింగ్​ ఉంచితే సంతానం త్వరగా కలుగుతుందని తెలుపుతున్నారు
  • లివింగ్ రూమ్​లో దక్షిణ గోడకు సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా కనిపించే వాల్ పేపర్ అతికించుకుంటే అదృష్టం త్వరగా వస్తుందని తెలుపుతున్నారు.
  • ఆఫీస్​లో కుర్చీకి వెనుకవైపు కొండలు, పర్వతాలు ఉన్న వాల్​పేపర్ అతికించుకోవడం వల్ల జీవితంలో సక్సెస్ అవుతారని చెబుతున్నారు. పిల్లలు చదవడంలేదని బాధపడేవారు కూడా కొండలు, పర్వతాలు ఉన్న వాల్​పేపర్ పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో పాటు పేపర్ గ్లోబ్ పెట్టాలని దీని వల్ల మంచిగా చదువుతారని చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

తులసి కోట దగ్గర ఈ తప్పులు చేస్తున్నారా? - ఐశ్వర్యం నశించి ఆర్థిక ఇబ్బందులు తప్పవు! - Avoid These Mistakes at Tulasi

వంట గదిలో ఈ పనులు చేస్తున్నారా? - అయితే, మీ ఇంటికి అష్టదరిద్రం పట్టుకుంటుంది! - Kitchen Vastu tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.