ETV Bharat / spiritual

ఇంట్లో వస్తువులను చక్కగా సర్దుకుంటే 'లక్​' మీదే! వాస్తు ప్రకారం ఇలా అమర్చుకోండి! - how to organise things at home - HOW TO ORGANISE THINGS AT HOME

How To Organize Things At Home : ఇంట్లోని వస్తువుల అమరికతో లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందా? వస్తువులు చిందర వందరగా ఉంటే దారిద్య్రం తాండవిస్తుందా? తరచుగా ఇంట్లోని వారు కింద పడి దెబ్బలు తగులుతున్నాయా? ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారా? అయితే ఎందుకు అలా అవుతుందో, వాటి పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం.

How To Organize Things At Home
How To Organize Things At Home
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 7:11 PM IST

How To Organize Things At Home : మన ఇంట్లో వస్తువులు ఎప్పుడూ చక్కగా అమర్చుకోవాలి. ఏ వస్తువు ఎక్కడ ఉంటే మంచిదని వాస్తు చెబుతోందో ఆ ప్రకారం ఇల్లు సర్దుకుంటే ఇంట్లో లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. అలా లేకపోతే మనకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ వస్తువును ఎక్కడ, ఎలా పెట్టాలో తెలుసుకుందాం.

ఆ వస్తువులు అసలు ఉండకూడదు
భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ ఉంటే ఆ ఇంట్లో తప్పకుండా వాస్తు దోషం ఉన్నట్లే. ముఖ్యంగా ఇంటి యజమాని స్థానం అయిన నైరుతి పడక గదిలో మంచం తూర్పు గోడకు ఆనించి ఉండకూడదు. అలాగే దంపతులు నిద్రించే మంచం దక్షిణం వైపు తల ఉండేలా అమర్చుకోవాలి. ఇంట్లోని దంపతులు నిద్రించే పడక గదిలో పనికిరాని, పగిలిపోయిన వస్తువులు ఉంచరాదు. అది దంపతుల మనఃశాంతిని దూరం చేస్తుంది. తరచూ గొడవలు పడుతూ ఉంటారు. మీ ఇంటి పడక గదిలో ఇలాంటి పనికిరాని వస్తువులు ఉంటే తక్షణమే బయట పడేయండి. అలాగే అద్దాల బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్ వంటివి కానీ ఉంచరాదు. పడగ గదిలో అద్దాల బీరువాలు అనర్థదాయకం. అద్దం లేని బీరువాలను ఉంచుకోవచ్చు. నైరుతి పడకగదిలో డబ్బులు ఉంచే బీరువాను ఉత్తరం దిశలో దక్షిణం చూసే విధంగా అమర్చుకుంటే నగదుకు లోటుండదు.

నరఘోషతో తస్మాత్ జాగ్రత్త!
ఎంత గొప్ప వాస్తు ఉన్న ఇంటికైనా నరఘోష లేకుండా ఉండదు. నరఘోషకు నల్ల రాయైన పగులుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఈ నరఘోష నుంచి కాపాడుకోవడం కోసం వాస్తు ప్రకారం ఉన్న ఈ చిట్కాలు పాటించండి.

  • మూడు నిమ్మకాయలు, ఒక ఎర్ర మిరపకాయ కలిపి ఒక దారానికి గుచ్చి ఇంటి ప్రధాన ద్వారానికి కడితే నరఘోష నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి శుక్రవారం వీటిని మార్చి మళ్లీ కొత్తగా కట్టుకోవాలి.
  • అలాగే ఒక శుభప్రదమైన రోజు మంచి సమయం చూసి బూడిద గుమ్మడికాయను ఉట్టిలో పెట్టి ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టుకోవాలి. ఇలా చేయడం వలన నరఘోష ప్రభావం ఇంట్లోని వారికి తగలదు. అయితే ఈ గుమ్మడికాయ బాగా కుళ్లిపోయే వరకు ఉంచి అప్పుడు కొత్తది మార్చుకోవాలి. గుమ్మడికాయ కుళ్లిందంటే నరఘోష కూడా పోయినట్లే అని అర్ధం చేసుకోవాలి.
  • పటికను నల్లదారంతో కట్టి ఇంటి గుమ్మంపైన ఉండేలా అమర్చుకుంటే నరఘోష తప్పకుండా పోతుంది.

ఇల్లాలే కీలకం!
ఇంట్లో వస్తువులు సర్దుకోవడం దగ్గర నుంచి, ఇంట్లోని వారికి నరఘోష తగలకుండా చూసే బాధ్యత ఇంటి ఇల్లాలిదే. మనం నివసించే ఇల్లు ఎప్పుడు జీవకళ ఉట్టిపడేలా ఉండాలి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లోని వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇల్లు ఎప్పుడు సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉండాలి. ఇంట్లో జీవకళ ఉంటే ఇంట్లోని వారందరు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. జీవకళ లేని ఇంట్లో ఎలాంటి పురోగతి ఉండదు.

అడుగడునా ఇబ్బందులా
ఏ ఇంట్లో అయినా మనకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ఆ ఇల్లు మారడమే మేలు. ఒకవేళ అది సొంత ఇల్లు అయితే వాస్తు ప్రకారం మార్పులు చేసుకోవాలి. లేదా కొత్త ఇంటికి మారాల్సిందే. ఇంట్లో నివసించే వారు ఊరికే కాలు జారి కింద పడి దెబ్బలు తగ్గించుకోవడం. లేకపోతే గోడలు, తలుపులు, మంచాలు కొట్టుకొని కాళ్లు చేతులు వాచి పోవడం తరచుగా జరుగుతూ ఉంటే స్నానాలగదిలో నైరుతి దిశలో ఒక గాజుపాత్రలో ఉప్పును ఉంచినట్లయితే ఈ ప్రమాదాలు జరగవు. ఉప్పుకు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ప్రతి రోజు ఉదయం ఇంట్లో దైవనామ స్మరణ మారుమ్రోగాలి. సుప్రభాతం వినాలి. ఇంట్లో అన్ని వైపులా ఉదయపు సూర్యకాంతి ప్రసరించాలి.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

లింగాభిషేకంతో ధనప్రాప్తి- సోమవారం ఇలా చేస్తే ప్రాబ్లమ్స్​ పటాపంచలు! - Shivling Abhishekam Benefits

శనివారం ఉప్పు, నూనెను కొంటున్నారా? అయితే కష్టాలు తప్పవ్​! - Things Do Not Do On Saturday

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.