Horoscope Today May 7th 2024 : మే 7న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజంతా సుఖశాంతులతో గడుస్తుంది. ఈ రోజంతా శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృవర్గం నుంచి ఆర్థిక లబ్ది ఉండవచ్చు. బంధుమిత్రులతో సరదాగా విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికి రాదు. ఆచరణాత్మకంగా ఉంటే మేలు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉండవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. శివారాధన మేలు చేస్తుంది.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజు. మీరు పట్టింది అంతా బంగారం అవుతుంది. గతంలో పెట్టిన పెట్టిన పెట్టుబడులకు ప్రయోజనాల ఫలాలను పొందండి. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. ఉద్యోగులకు శుభసమయం నడుస్తోంది. ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారికి ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి గ్రహసంచారం శుభకరంగా ఉంది కాబట్టి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి, బదిలీ అందుకుంటారు. వ్యాపారులు విపరీతమైన లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. సుబ్రమణ్య స్వామిని ఆరాధిస్తే మరిన్ని శుభఫలితాలు పొందవచ్చు.
సింహం (Leo) :ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. గతంలో మొదలు పుట్టిన పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు మీ లక్ష్యం దిశగా మీ నడక ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలు మిమ్మల్ని తీరిక లేకుండా చేయవచ్చు. ఒక తీర్థయాత్రకి ప్రణాళిక వెయ్యవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. విదేశాలలోని బంధువుల నుంచి అందిన సమాచారంతో మీకు మానసిక శాంతి కొరవడుతుంది. వ్యాపారులకు వ్యాపారంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనం ఉండదు. శివారాధనతో మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా గందరగోళంగా, ఒత్తిడితో ఉంటారు. ఏవో కొన్ని అర్ధం కాని విషయాలు మిమ్మల్ని తికమక పెడతాయి. మీ స్నేహితులతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. ఆచి తూచి నడుచుకుంటే మేలు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిలో పురోగతి ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు తారా బలం చాలా బాగుంది. మీ జాతకంలో ఇప్పటివరకూ ఉన్న చెడు ప్రభావం తొలగింది. ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ వాతావరణం శాంతియుతంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. మానసిక శాంతికి లోటుండదు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ముఖ్యమైన అవసరాలకే ఆచి తూచి ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల సాయం, పై అధికారుల సాయం ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహసంచారం మెరుగు పడటానికి మరికొంత సమయం పట్టవచ్చు. అప్పటివరకు సహనంతో ఉండండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. పిల్లల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక నష్టం సూచితం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. వైద్య చికిత్సలకు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. కుటుంబ వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. మీ మొండితనం, నిర్లక్ష్య వైఖరీ కారణంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, తల్లితో విరోధం వంటి సమస్యలు ఏర్పడుతాయి. సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే అవమానాలు ఎదురుకావచ్చు. నీటి గండం ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. శని స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి శుభసమయం నడుస్తోంది. ఇప్పటివరకు వెంటాడిన ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని వీడుతాయి. గతం కంటే ఎంతో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే మీ మిత్రులే శత్రువులవుతారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి. ఆరోగ్యం సహకరించదు. తగిన విశ్రాంతి అవసరం. కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు చెలరేగి మీకూ, మీ బంధువులకూ మధ్య అభిప్రాయ భేదాలు నెలకొనే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగుతాయి.