ETV Bharat / spiritual

ఆ రాశివారికి బిజినెస్​లో లాభాలే లాభాలు- ట్రిప్​ ప్లాన్​కు ఛాన్స్​! - telugu horoscope free

Horoscope Today March 7th 2024 : మార్చి 7న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 7th 2024
Horoscope Today March 7th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 5:36 AM IST

Horoscope Today March 7th 2024 : మార్చి 7న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మీ జీవితం ఆనందకరంగా సాగుతుంది. కుటుంబసమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఫలవంతమైన చర్చల్లో పాల్గొంటారు. ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ పనుల గురించి చర్చిస్తారు. మీ తల్లి నుంచి ప్రయోజనం పొందవచ్చు. కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. మీ పనిపట్ల పై అధికారులు ప్రశంసలు కురిపిస్తారు. ఇవి మీలో మరింత ఉత్తేజాన్ని నింపుతాయి. ప్రభుత్వ పనిపై ఓ ఉపయోగకరమైన ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.

.

వృషభం (Taurus) : ఈ రోజు మీ తారాబలం అనుకూలంగా ఉంది. ఎంతో కాలంగా వెళ్లాలనుకుంటున్న దూర ప్రాంతాలకు లేదా తీర్థయాత్రలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్​ను చేపట్టడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు మంచి రోజు. విదేశాల్లో ఉన్న మీ ప్రియమైనవారి దగ్గర్నుంచి ఓ శుభవార్త వింటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. జాగ్రత్త.

.

మిథునం (Gemini) : ఈ రోజు మీ కోరికలను అదుపులో ఉంచుకోండి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. అపరిచితులకు, ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య సంబంధమైన ఏవైనా పరీక్షలు చేయించాల్సి ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం ఉత్తమం. వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఖర్చులు ఉన్నాయి జాగ్రత్త. సంగీతం వినండి, ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. తారాబలం అనుకూలంగా ఉంది. సరదాగా గడుపుతారు. షాపింగ్​ చేస్తారు. విదేశాల నుంచి వచ్చిన ఓ గొప్ప వ్యక్తిని ఈ రోజు మీరు కలుసుకుంటారు. తద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో విజయం సాధిస్తారు. లాభాల్లో వృద్ధిని నమోదు చేస్తారు. పేరు ప్రతిష్ఠలు, ప్రశంసలు పొందుతారు.

.

సింహం (Leo) : ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. మీ భాగస్వామి లేదా సహచరులు నిరాశలోకి నెట్టేస్తారు. మీ అంచనాల శక్తి ద్వారా చక్కని లాభాలను పొందుతారు. మీ స్నేహితులు ఇచ్చే సలహాలను పాటించేందుకు ప్రయత్నిస్తారు.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానం, ప్రియమైన వారి గురించి ఆలోచించి మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఖర్చులు ఉన్నాయి. మీ మనసులోని మాటలను స్నేహితులకు లేదా ప్రియమైన వారికి చెప్పండి. తద్వారా మానసిక ఒత్తిడి దూరమవుతుంది. కొన్ని చర్చల్లో పాల్గొనకుండా ఉండటం మేలు. షేర్​ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టకపోవడం ఉత్తమం.

.

తుల (Libra) : మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఈ రోజు భావోద్వేగానికి లోనవుతారు. వైవాహిక జీవితంలో అసంతృప్తి వాతావరణం ఏర్పడుతుంది. ప్రాణాయామం చేయండి. శారీరకంగా ఉపశమనం పొందుతారు. నీటిగండం ఉంది. జలాశయాలకు, ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు తారాబలం అనుకూలంగా ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ రోజు మంగళకరంగా ఉంది. మీ సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో ఫలవంతమైన విషయాలను చర్చిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఊహించని విజయం ఎదురవుతుంది. స్నేహితులతో కలిసి ఓ చిన్ని ప్రయాణం చేస్తారు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. ఒక ముఖ్యమైన విషయం పట్ల నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టపడతారు. ఒత్తిడికి దూరంగా ఉండండి. లేదంటే మీ ప్రియమైన వారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలను చూస్తారు. పని ఒత్తిడి ఉంది. ఖర్చులు అధికంగా ఉన్నాయి.

.

మకరం (Capricorn) : వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్​ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే ఉద్యోగంలో మంచి లాభాలను పొందుతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీకు ఇష్టమైన వారితో లేదా మీ స్నేహితులతో కలిసి విందు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమయాన్ని కేటాయించండి.

.

కుంభం (Aquarius) : ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. పెండింగ్​ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. సంతృప్తి చెందిన ధోరణితో ఉండటం మంచిది కాదు. మీ ప్రత్యర్థులపై ఎలా పైచేయి సాధించాలి అనే దానిపై దృష్టి పెట్టండి. కుటుంబం, సహచరుల నుంచి సహకారం అందుతుంది.

.

మీనం (Pisces) : సమాజంలో అందరితో కలిసిపోతారు. మీ ప్రియమైన వారితో మీకున్న సంబంధాలు మంచి ఫలితాలనిస్తాయి. వీరి కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. కొన్నిబంధాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయని ఫలితాలు చెబుతున్నాయి. ఒక మంచి ప్రదేశానికి ట్రిప్​కు వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు ఓ శుభవార్త వింటారు. ఆర్థికంగా అదనపు లాభాలను పొందుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.